Cotton Ear Buds Vs Ear Wax : కాటన్ ఇయర్ బడ్స్..
ఇవి మీరు వాడుతారా ?
వీటితో చెవిని శుభ్రం చేస్తుంటారా ?
కాటన్ ఇయర్ బడ్స్ మంచివా ? కావా ?
కాటన్ ఇయర్ బడ్స్ ను తరుచుగా వినిపయోగించడం వల్ల చెవిలోని గులిమి బయటకి రాకపోగా .. మరింత లోపలికి వెళ్ళిపోతుంది. జిగటగా మెత్తగా ఉండే ఈ పదార్థం గట్టిగా మారిపోయి అడ్డంకిగా తయారయ్యే ముప్పు ఉంటుంది. దీనివల్ల వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఈ గుమిలి వల్ల చెవిపోటు వస్తుంది. విపరీతమైన చెవి నొప్పి, ఇన్ఫెక్షన్ కూడా వస్తాయి. ఇయర్ బడ్స్ మంచి కంటే చెడు ఎక్కువ చేస్తున్నాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ జర్నల్‌లో పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం వెల్లడించింది. చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడే చాలామంది పిల్లలు కాటన్ బడ్స్ వాడుతున్నారని డాక్టర్లు అంటున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే.. చెవి నాళాలలోని మృదులాస్థి, ఎముకలకు ఇన్ఫెక్షన్ సోకే రిస్క్ ఉంటుంది. కర్ణభేరికి ఇన్ఫెక్షన్ సోకి అది ముదిరినప్పుడు చెవుడు, మెదడు వాపు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చిన్న పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. వారి చెవుల్లోకి నీరు, షాంపూ వెళ్లకుండా చూసుకోవాలి.
Also read : WhatsApp microphone access :వాట్సాప్ మైక్ చెవులు.. మీ మాటల్ని వింటున్నాయా?
చెవులలోని గుమిలి తీసెయ్యాలా ? వద్దా ?
చెవుల్లోకి దుమ్ము, బ్యాక్టీరియా, సూక్ష్మ క్రిములు, చిన్న వస్తువులు పోకుండా ఉండేందుకు గుమిలి(Cotton Ear Buds Vs Ear Wax) సహాయపడుతుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు లోపలికి పోకుండా అడ్డుకోవడంలో ఇది రక్షణ గోడలా పని చేస్తుంది. అందుకే చెవిలో ఉండే వ్యాక్స్ వదిలించుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఇయర్ వాక్స్ దాన్ని అదే సహజంగా శుభ్రం చేసుకుంటుంది. దాన్ని ప్రత్యేకంగా తీసివేయాల్సిన అవసరం లేదు. హార్వర్డ్ హెల్త్ అసోసియేషన్ ప్రకారం చెవిలో గులిమి ఉంటే అది అనారోగ్యకరమని అర్థం కాదు. చెవి లోపల ప్రదేశాన్ని క్లీన్ చేసుకునేందుకు తడి లేదా వెచ్చని వస్త్రంతో తుడవడం మంచిది. చెవులని క్లీన్ చేసేందుకు మార్కెట్లో ఓవర్ ది కౌంటర్ క్లీనింగ్ డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. సహజమైన ఉత్పత్తులతో వీటిని తయారు చేస్తారు. వీటిని చెవులో వేసుకుంటే క్లీన్ అయిపోతాయి.సిరంజ్ ఉపయోగించి చెవిలో నీటిని పంపించొచ్చు. ఈ నీటితో చెవులు శుభ్రపడతాయి.
గమనిక: ఈ వార్తలోని వివరాలను మెడికల్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, అధ్యయన నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.