Site icon HashtagU Telugu

Mouth Ulcers : నోట్లో పుండ్లు పుట్టి ఏం తినలేకపోతున్నారా? ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది

Mouth Ulcers

Mouth Ulcers

Mouth Ulcers : నోటి పుండ్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏమీ తినాలన్నా, తాగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. నోట్లో పుండ్లు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. సాధారణంగా మనం ఎక్కువ వేడి చేసే ఆహార పదార్థాలు, మసాలా, ఆయిల్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు లేదా బయటి ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వీటివల్ల శరీరంలో వేడి పెరిగి పుండ్లు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ లోపం (ముఖ్యంగా విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్) వల్ల కూడా పుండ్లు వస్తాయి. కొన్ని అరుదైన సందర్భాలలో మౌత్ క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలకు కూడా ఇది సూచన కావచ్చు. అయితే, చాలా సందర్భాల్లో సాధారణ కారణాల వల్లే ఇవి వస్తాయి.

 
ఈ నోటి పుండ్లను ఎలా తగ్గించుకోవాలంటే?
ఈ పుండ్లను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా, శరీరానికి చలవ చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు, కూరగాయలు, చియా సీడ్స్, కీర దోస వంటివి ఎక్కువగా తినడం మంచిది. అలాగే, రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. మసాలా, కారం, నూనె పదార్థాలను కొన్ని రోజులు మానేయాలి. కొందరు వీటిని అధికంగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఫ్రై కర్రీస్, అప్పడాలు (నూనె వస్తువులు) తక్కువగా తీసుకోవడం వలన వీటికి గుడ్ బై చెప్పవచ్చును.

నీటి థెరపీ..
నోటి పుండ్ల నుండి త్వరగా ఉపశమనం పొందడానికి ఉప్పు నీటితో పుక్కిలించడం ఒక మంచి పరిష్కారం. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి, రోజుకు రెండు మూడు సార్లు పుక్కిలించాలి. ఇది పుండ్లలోని బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడుతుంది. అలాగే, మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల కూడా నోటి పరిశుభ్రత పెరుగుతుంది. దాల్చిన చెక్క, లవంగం వంటి వాటితో చేసిన మౌత్ వాష్‌ను వాడటం మంచిది. ఇలా చేయడం వలన బ్యాక్టీరియా ఎప్పుడైనా నోటిలోకి చేరితే వెంటనే నిర్మూలించడానికి ఆస్కారం ఉంటుంది.

వైద్యులు సాధారణంగా నోటి పుండ్లు తగ్గడానికి బి-కాంప్లెక్స్ టాబ్లెట్‌లను సూచిస్తారు. ఈ టాబ్లెట్‌లు శరీరంలోని విటమిన్ లోపాన్ని భర్తీ చేయడానికి సహాయపడతాయి. ఒకవేళ పుండ్లు తీవ్రంగా ఉండి, ఒకటి రెండు వారాలైనా తగ్గకపోతే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. వారు సరైన కారణాన్ని గుర్తించి, తగిన చికిత్సను అందిస్తారు. అంతేకాకుండా, నోటి పుండ్లు రాకుండా ఉండాలంటే, మంచి ఆహారపు అలవాట్లను పాటించడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం. అలాగే, ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవడం కూడా మంచిది. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదు.

Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’