Mouth Ulcers : నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే?

చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. కారం వస్తువులు తినాలి అన్న వేడి వస్తువులు తినాలి అన్నా కూడా కాస్త భయపడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) సమస్యలు ఎక్కువగా పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కడుపు శుభ్రంగా లేకపోయినా కూడా శరీర ఉష్ణోగ్రతలు […]

Published By: HashtagU Telugu Desk
Are You Suffering From Mouth Ulcers.. But These Simple Tips Should Be Followed..

Are You Suffering From Mouth Ulcers.. But These Simple Tips Should Be Followed..

చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా భయపడుతూ ఉంటారు. కారం వస్తువులు తినాలి అన్న వేడి వస్తువులు తినాలి అన్నా కూడా కాస్త భయపడుతూ ఉంటారు. ఈ నోటి పూత (Mouth Ulcers) సమస్యలు ఎక్కువగా పోషకాహార లోపం వల్ల వస్తూ ఉంటాయి. అలాగే కడుపు శుభ్రంగా లేకపోయినా కూడా శరీర ఉష్ణోగ్రతలు పెరిగిన నోటిపూత సమస్యలు వస్తుంటాయి. అలాగే అధిక ఒత్తిడికి గురవటం, డీహైడ్రేషన్ వంటివన్నీ నోటిపూతకు కారణాలే.

We’re Now on WhatsApp. Click to Join.

ఈ సమస్య వచ్చినప్పుడు తినడం తాగటం కష్టమవుతుంది. అలాగే పెదవుల లోపల హెర్పస్ సింప్లెక్స్ వైరస్ ఏర్పడే పొక్కులు క్రమంగా పుండ్లుగా మారుతాయి. ఇది ఎర్రగా మారి బాగా ఇబ్బంది పడతాయి. అలాంటప్పుడు కొంతమంది వెంటనే వైద్యుని సంప్రదిస్తూ ఉంటారు. అయితే అలా వైద్యుని దగ్గరకు వెళ్లడానికి బదులు కొన్ని సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాలను చంపడంలో సహాయపడుతుంది. ఇందువలన ఇది నోటి అల్సర్ సమస్యకు మంచి పరిష్కారాన్ని అందిస్తుంది.

నోటిపూత మీద నెయ్యి రాస్తే రెండు రోజుల్లో పుండు క్రమంగా తగ్గుతుంది. అలాగే దేశీ నెయ్యిని ఉపయోగించడం వలన నోటి పూత (Mouth Ulcers) తగ్గుతుంది. నెయ్యి అల్సర్లకు ఇది చాలా మేలు చేస్తుంది. ఇది వాడిన కొద్ది రోజుల్లోనే అల్సర్లు పూర్తిగా నయం అవుతాయి. రాత్రి పడుకునే ముందు నోటి పొక్కులపై నెయ్యి రాసి ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే నోటిపూత తగ్గించడానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీబయోటిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అల్సర్లను దూరం చేస్తాయి. ఇందుకోసం కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

ఆ తర్వాత నోటి పొక్కులపై మెత్తగా అప్లై చేయాలి. ఇలా చేస్తే నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది. టీ ట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నోటి అల్సర్ లను నయం చేయడంలో బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు టీ ట్రీ ఆయిల్ లో నోటి పూత పై రాసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read:  Ranbir Kapoor Animal OTT Version : యానిమల్ ఓటీటీ వెర్షన్.. వాళ్లని అసంతృప్తి పరచిన సందీప్ వంగ..!

  Last Updated: 26 Jan 2024, 05:28 PM IST