Pain Relief Tips : ప్రస్తుత రోజులో చిన్న పెద్ద అని తేడా చాలామంది ఈ మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, భుజాల నొప్పులు అంటూ రకరకాల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇదివరకటి రోజుల్లో ఇలాంటి నొప్పులు (Pain) అన్నీ కూడా కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేవి. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళు రకరకాల ఆయింట్మెంట్లు స్ప్రేలు, మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అవేమీ ఉపయోగించకుండా నొప్పులు (Pain) మాయం అవ్వాలంటే కొన్ని హోమ్ రెమిడీస్ ని ఫాలో అవ్వాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
We’re Now on WhatsApp. Click to Join.
దీని కోసం మన కావాల్సింది కేవలం నాలుగు మిరియాలు. ఒక బౌల్ తీసుకొని అందులో మిరియాలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం తీసుకోవాలి. ఆ తర్వాత 250 ఎంఎల్ పాలు తీసుకోవాలి. ఆ పాలలోకి అల్లం మిరియాలు వేసి బాగా కాగా పెట్టాలి. బాగా ఉడికిన తర్వాత వడకట్టుకొని అందులో పట్టిక బెల్లం పొడి వేసుకోవాలి. ఈ పాలను పడుకునే ముందు తాగి పడుకోవడం వల్ల ఎటువంటి నొప్పులు అయినా సరే మాయం అవ్వాల్సిందే.
అయితే ఈ రెమిడీని కంటిన్యూగా ఒక మూడు నాలుగు రోజులపాటు చేయడం వల్ల ఫలితాలు కనిపిస్తాయి. ప్రస్తుతం చలికాలం కావడంతో కీళ్ల నొప్పుల సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైన చెప్పిన రెమెడీని తప్పకుండా పాటించడం వల్ల ఆ నొప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే అప్పుడప్పుడు కాకుండా క్రమం తప్పకుండా వీటిని ఫాలో అవుతూ ఉండడం వల్ల ఎటువంటి కీళ్ల నొప్పులు ఉండవు. అలాగే ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉండదు.