Site icon HashtagU Telugu

Constipation Tips : మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..? అయితే పాప్ కార్న్ తినాల్సిందే..

Are You Suffering From Constipation Problem.. But You Have To Eat Popcorn..

Are You Suffering From Constipation Problem.. But You Have To Eat Popcorn..

Constipation Tips with Popcorn : ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో మలబద్ధకం సమస్య ఒకటి. ఈ మలబద్ధకం (Constipation) సమస్య వచ్చినప్పుడు చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మలబద్ధకంగా ఉంటే ఆకలి వేసినా, ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పొట్ట సమస్యే అని చెప్పవచ్చు. కాబట్టి వీలైనంత వరకూ ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్, నీటి శాతం తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకుంటే తిన్న ఆహారం జీర్ణం కాక మలబద్ధకం (Constipation) సమస్యను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాబట్టి మీ ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేసుకోవాలి. ఈ సమస్య నుంచి బయట పడేయటంలో పాప్ కార్న్ బాగా సహాయ పడుతుంది. చాలా మంది సినిమాలకు వెళ్లినప్పుడు లేదా టైమ్ పాస్ గా కూడా పాప్ కార్న్ తింటూ ఉంటారు. చాలా మంది ఇది తింటే కడుపు ఉబ్బరంగా ఉంటుందనుకుంటారు. కానీ నిజానికి పాప్ కార్న్ తీసుకోవడం వల్ల మల బద్ధకం సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ సాయంత్రం పూట పాప్ కార్న్ తింటే చాలా మంచిది. ఓట్స్.. అలాగే తరుచుగా ఓట్స్ తినడం వల్ల కూడా మల బద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. ఓట్స్ లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది.

దీని కారణంగా తిన్న ఆహారం త్వరగా జీర్ణమైన.. మల విసర్జన అవుతుంది. అంతే కాకుండా జీర్ణ, పొట్ట సమస్యల నుంచి కూడా ఉపశమనం పొంద వచ్చు. మల బద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు తరుచుగా ఓట్స్ ని తీసుకోవడం బెటర్. చిలగడదుంప.. శీతా కాలంలో మాత్రమే కేవలం ఈ చిలగడ దుంప లభ్యమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు దీన్ని తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇది తినడం వల్ల మల బద్ధకం సమస్యల తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చిలగడ దుంపలో ఉండే గుణాలు ప్రేగులను శుభ్రం చేసేందుకు హెల్ప్ చేస్తుంది.

Also Read:  White Hair Tips : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి చిప్పతో ఇలా చేయాల్సిందే..