Bloating Tips in Winter : చలికాలంలో ఉబ్బరం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ సింపుల్ చిట్కాలు పాటించాల్సిందే..

కడుపు అంత ఉబ్బరంగా (bloating) ఉండడం బొడ్డు వద్ద పట్టేసినట్టు, పొత్తి కడుపు వద్ద నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది చలికాలంలో ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Are You Suffering From Bloating In Winter.. Follow These Simple Tips..

Are You Suffering From Bloating In Winter.. Follow These Simple Tips..

Tips for Bloating issue in Winter Season : మామూలుగా చాలామందికి చలికాలంలో ఎక్కువగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. దీంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కడుపు అంత ఉబ్బరంగా (bloating) ఉండడం బొడ్డు వద్ద పట్టేసినట్టు, పొత్తి కడుపు వద్ద నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకొంతమంది చలికాలంలో ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఇదే సమయంలో కొంతమంది మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఊబకాయం ఉన్నవాళ్లు సమస్య చెప్పలేనిది ఎక్కువ ఊబకాయం ఉన్నవాళ్లు కడుపు సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

వాళ్లకు పొట్ట పట్టేసినట్టుగా ఉండడం అలాగే ఆకలి లేకుండా అన్ ఈజీగా ఉంటుంది. ఈ కడుపు ఉబ్బరం (bloating) సమస్య ఎక్కువగా పెద్ద వయసు వాళ్ళుకి అలాగే పిల్లలు ఉన్న ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కడుపుబ్బరం అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. చలికాలంలో తక్కువ నీరు తీసుకోవడం వలన డిహైడ్రేషన్ కి గురైతే ఉబ్బరం సమస్య వస్తూ ఉంటుంది. అదేవిధంగా చలికాలంలో వ్యాయామం విషయంలో ఆలస్సత్యంలో ఎక్కువగా నిద్రిస్తూ ఉంటారు. ఈ విధానం వలన ఉబ్బరం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. చలికాలంలో మనం తీసుకునే ఆహారం వలన జీర్ణక్రియ అంతరాయం చెంది ఈ సమస్యలు వస్తూ ఉంటాయి.

చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది టీ, కాఫీలు అధికంగా తీసుకుంటూ ఉంటారు. అధికంగా టీ కాఫీలు తీసుకునే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ ఉబ్బరం సమస్యకు నివారణ చిట్కాలు.. అతిగా నిద్రపోకుండా రోజంతా యాక్టివ్ గా ఉండాలి. కచ్చితంగా శారీరిక వ్యాయామం చేస్తూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా కాలానికి అనుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను కూడా తీసుకోవాలి. శీతాకాలంలో శరీరాన్ని అవసరమైన మేరకు నీటిని తీసుకోవాలి. అదేవిధంగా శరీరం డిహైడ్రేషన్ కి గురికాకుండా చూసుకోవాలి. ఈ విధంగా చేస్తే చాలావరకు ఉబ్బరం సమస్య నుంచి బయటపడవచ్చు.

Also Read:  Airport Jobs : ‘ఎయిర్‌పోర్ట్స్’‌లో 119 జాబ్స్.. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు

  Last Updated: 25 Dec 2023, 04:58 PM IST