Site icon HashtagU Telugu

Winter Season Tips : శీతాకాలంలో అలాంటి తప్పులు చేస్తున్నారా..? అయితే జాగ్రత్త ప్రాణాలు కోల్పోతారు..

Are You Making Such Mistakes In Winter.. But Beware Lives Will Be Lost..

Are You Making Such Mistakes In Winter.. But Beware Lives Will Be Lost..

మామూలుగా శీతాకాలంలో అనేక రకాల వ్యాధులు చుట్టూ ముడుతూ ఉంటాయి. అలాంటప్పుడు తక్షణ చర్యలు తీసుకోకపోతే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి శీతాకాలంలో (Winter Season) అలాంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ముందుగానే కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చలికాలంలో మనం పొరపాటు చేసినా చేయకపోయినా ఎన్నో వ్యాధులు మనకి వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో జలుబులు, దగ్గులు లాంటి వ్యాధులు పెరుగుతూనే ఉంటుంది. వీటిలో చాలా ప్రమాదకరమైనది గుండెపోటు. ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తుంటాయి. చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని వలన గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ప్రధానం. చాలామంది ఎక్కువగా గుండెపోటుకు గురవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే శీతాకాలం (Winter Season) ఎటువంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

అధిక బరువు లేదా ఊబకాయం రక్తపోటు ఉన్నవాళ్లకి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చలికాలంలో రక్తనాళాలు కుషించకపోవడం వలన స్ట్రెస్ పెరిగి బీపీ కూడా అధికమవుతుంది. ఉదయం సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత తగ్గడం మూలంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది దీని మూలంగా శరీర ఉష్ణోగ్రతను సమం చేస్తున్నప్పుడు ఆ రక్తపోటు అధికమై గుండె నొప్పికి దోహదపడుతుంది.

ఈ చలికాలంలో ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య లో వాకింగ్ వెళ్లకూడదు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత వెళ్లాలి. రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ప్రధానం. అధిక బీపీ ఉన్నవాళ్లు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. చల్లని బట్టలు పట్ల ప్రత్యేకత వహించాలి. ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం చాలా ప్రధానం. ఆహారంపై నియంత్రణ కలిగి ఉండాలి. వేయించిన తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. నిత్యం కొంత సేపు వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువగా తీసుకోవాలి. సూర్యకిరణాల వెలుతురులో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. ఈ చిన్న చిన్న విషయాలను గుర్తించుకోవడం వల్ల హార్ట్ ఎటాక్ లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Also Read:  Hibiscus Plant: సూర్యుడికి మందార పువ్వులతో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాల గురించి మీకు తెలుసా?