స్నాక్స్ నుండి మెయిన్ కోర్స్ వరకూ పెరుగు లేకుండా భోజనాన్ని ఊహించడం కష్టం. ఈ పులియబెట్టిన పాల ఉత్పత్తి మన ఫుడ్‌లో ఓ భాగం. పెరుగన్నం లేనిదే మనకి ముద్ద దిగదు. లాస్ట్‌లో పెరుగు తింటే ఆ తృప్తే వేరు. అయితే, పెరుగు వాడకానికి సంబంధించి కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఏంటి?, అవి తీసుకోవడానికి సరైన మార్గం, సమయం ఏంటి?, దీని గురించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
చాలా రోజుల నుండి, పెరుగు మన రోజువారీ ఆహారంలో ఓ ముఖ్య భాగం. దీనికి కారణం అందులోని ప్రత్యేక గుణాలు. రోజూ పెరుగు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవ్వడంలో సాయపడుతుంది, పోషకాల శోషణ మెరుగుపరుస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది, అంతేకాకుండా పెరుగులో చల్లని గుణాలు ఉన్నప్పటికీ ఏడాది పొడవునా తినడానికి ప్రధాన కారణం ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ ఉండడం, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, జీర్ణక్రియలు, మంటను తగ్గించడం, ఊబకాయం వంటివి ఉన్నాయి.
పెరుగుకు చల్లని శక్తి ఉంటుంది. అయితే, చలికాలంలో దీనిలో తేనె, నల్ల మిరియాలు, కాల్చిన జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులను కలిపి ఆరోగ్యానికి మంచి చేసేదిగా చేయొచ్చు. ఇది శక్తిని బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది. శరీరంలో శ్లేష్మం (Mucus) ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ, మలబద్ధకం మెరుగుపరచడానికి సాయపడుతుంది.
అయితే ఏది కూడా అతిగా తినకూడదని గుర్తుపెట్టుకోండి. చలికాలంలో పెరుగుని తినేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సమయంలో తీసుకోవాలి? మీ హెల్త్ కండీషన్ ఎలా ఉంది? ఎలాంటి టెంపరేచర్‌లో తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ముందుగా మీ డాక్టర్‌ని సంప్రదించి మీ కండీషన్‌ని అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది. దీంతో ఒకరి హెల్త్‌కి పడే ఫుడ్స్ మరొకరికి పడకపోవచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. అదే విధంగా ఎలా తింటే మంచిదో కూడా తెలుసుకుని తీరాల్సిందే.