Site icon HashtagU Telugu

Tea : ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా.. అయితే ఆ సమస్యలు రావడం ఖాయం?

Are You Drinking Tea On An Empty Stomach..

Are You Drinking Tea On An Empty Stomach..

Drinking Tea on Empty Stomach : మామూలుగా మనలో చాలామందికి ఉదయం లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. మరికొందరు పళ్ళు శుభ్రం చేసుకున్న వెంటనే కాఫీ లేదా టీ (Tea)లు తాగుతూ ఉంటారు. అలా రాను రాను కాపీ ఒక వ్యసనంగా మారిపోయింది. ఒకరోజు కాఫీ తాగకపోతే ఆ రోజు అంతా కూడా ఏదో కోల్పోయిన వారిలా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కాఫీ టీలు తాగడం మంచిదే కానీ మితిమీరి తాగితే మాత్రం ప్రమాదాలు తప్పవు. అదేవిధంగా పరగడుపున ఖాళీ కడుపుతో టీ (Tea) తాగడం కూడా అస్సలు మంచిది కాదు అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా బ్లాక్ టీ అస్సలు మంచిది కాదు అంటున్నారు.

We’re Now on WhatsApp. Click to Join.

మరి ఖాళీ కడుపుతో బ్లాక్ టీ (Black Tea) తాగితే ఎటువంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్లాక్ టీ తాగడం వలన గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. ఇది క్రమేపి వాత సమస్యను కలిగిస్తూ ఉంటుంది. దాని ఆమ్ల ప్రభావం మూలంగా ఎన్నో అనారోగ్యం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శరీరంలో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మలబద్ధకం కూడా వస్తుంది. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వకపోతే మలవిసర్జన ప్రక్రియలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. బ్లాక్ టీ (Black Tea) అమ్లత్వం కలిగి ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో త్రాగడం వలన ఆమ్ల ప్రభావం పెరుగుతుంది.

ఇది దంతాలపై ఉండే ఎనామిల్ ని దెబ్బతీస్తుంది. బ్లాక్ టీలో తియో ఫిలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో డీహైడ్రేషన్ కి కారణం అవుతుంది. దీనిని రోజు తాగే అలవాటు ఉన్నవాళ్లకి ఇది క్రమంగా ఇబ్బందికరంగా మారుతుంది. బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఆమ్ల ప్రభావాన్ని కలిగి ఉండడం వలన దానిని ఖాళీ కడుపుతో తీసుకుంటే వలన శరీరం ఆసిడ్ ఆల్కలిన్ బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. ఇది రోజు గడుస్తున్న కొద్ది ఎస్డిటి లేదా అజీర్తి పెరిగేలా చేస్తుంది. ఇదే బ్లాక్ టీ తాగాలి అనుకున్న వారు ఎప్పుడూ ఇప్పుడు తాగాలి అన్న విషయానికి వస్తే.. భోజనం చేసిన తర్వాత తీసుకోవడం చాలా మంచిది అంటున్నారు వైద్యులు.

Also Read:  Milk – Kids : పిల్లలు ఇష్టంగా పాలు తాగేలా చేయాలా.. టిప్స్ ఇవిగో