Lemon Juice: ప్రస్తుతం ఎండలు బాగా మండిపోతున్నాయి. బయటకు రావాలంటే బానుడి ప్రతాపం బాగా బీభత్సం సృష్టిస్తుంది. దీంతో చాలామంది జనాలు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఇక ఉద్యోగస్తులు, ఇతర కార్మికులు తప్పనిసరిగా బయటికి రావాల్సిందే. దీంతో బయటికి వచ్చే ప్రతి ఒక్కరు ఎండ నుండి రక్షణ పొందడానికి గొడుగు, మంచినీరు వంటివి అందుబాటులో పెట్టుకుంటున్నారు.
ఈ ఎండాకాలంలో ఎంత నీరు త్రాగితే అంత మంచిది. లేదంటే వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మంచినీళ్లతో పాటు నిమ్మరసం కలిపిన నీరు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇది వేడిని పూర్తిగా తగ్గిచేస్తుంది. మామూలుగా ఎండాకాలంలోనే కాకుండా మిగతా కాలంలో కూడా నిమ్మరసం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు నిమ్మరసం తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.
మరి ప్రతిరోజు నిమ్మరసం తాగడం ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మామూలుగా నిమ్మకాయలో విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు గోరువెచ్చని నీటిలో చిటికెడు తేనెతో పాటు నిమ్మరసం కలిపి తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా బాగా సహాయపడుతుంది నిమ్మరసం. ఇక నిమ్మకాయల తొక్కలో, గుజ్జలో పెక్టిన్ అనే కరిగిపోయే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయంలో జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఇక నిమ్మరసం తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా శరీర బరువును, కొవ్వును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇవే కాకుండా గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ఎన్నో రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా దూరం చేస్తుంది. అంటువ్యాధులు, ఇతర వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. కాబట్టి ప్రతి రోజు రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు.