Site icon HashtagU Telugu

Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరుగుతున్నాయా? మీరు డేంజర్‌లో పడినట్లే!

High Uric Acid

High Uric Acid

Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతున్నది చాలా మందికి తెలీదు. ఆధునిక జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ అనే పదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా, ఈ యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా వడపోసి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది.అయితే, యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినప్పుడు లేదా మూత్రపిండాలు సరిగా తొలగించలేనప్పుడు, అది రక్తంలో పేరుకుపోయి హైపర్యూరిసెమియా అనే పరిస్థితికి దారితీస్తుంది.ఇది దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

యూరిక్ యాసిడ్ పెరిగిందని ఎలా గుర్తించాలి?

యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి.వీటిలో ముఖ్యమైనది కీళ్ల నొప్పి.. ముఖ్యంగా కాలి బొటనవేలిలో నొప్పి ఉంటుంది. దీన్ని గౌట్ అని పిలుస్తారు. కీళ్లలో నొప్పి, వాపు, ఎరుపుదనం,  వేడిగా అనిపించడం వంటి లక్షణాలుంటాయి.కొన్నిసార్లు ఈ నొప్పి అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చి భరించలేని విధంగా ఉంటుంది. అలాగే, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల నడుము లేదా పక్కటెముకల కింద తీవ్రమైన నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది లేదా నొప్పి, మూత్రం నురుగుగా లేదా రక్తాన్ని కలిగి ఉండటం, వికారం, వాంతులు కూడా యూరిక్ యాసిడ్ పెరిగిందని సూచించవచ్చు. కొన్నిసార్లు చర్మం కింద గడ్డలు (టోఫీ) కూడా ఏర్పడతాయి.

Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ

కలిగే నష్టాలు, దుష్ప్రభావాలు

యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటే గౌట్.. మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు మాత్రమే కాకుండా ఇంకా అనేక తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయి. దీర్ఘకాలంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం మూత్రపిండాల పనితీరును దెబ్బతీసి, కిడ్నీ వ్యాధులకు దారితీస్తుంది. ఇది గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటితో కూడా ముడిపడి ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోవడం వల్ల కీళ్ల కదలికలు తగ్గిపోయి వైకల్యానికి కూడా దారితీయవచ్చు.

నివారణ , చికిత్స
యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. దీనికి ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలైన ఎర్ర మాంసం, సీఫుడ్, కొన్ని రకాల పప్పులు, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. బరువును అదుపులో ఉంచుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి జీవనశైలి మార్పులు కూడా సహాయపడతాయి. లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని తగ్గించే మందులు (అల్లోపురినాల్, ఫెబుక్సోస్టాట్) లేదా దాని తొలగింపును పెంచే మందులు (ప్రోబెనెసిడ్) అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం అవసరం.

Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్‌గా అమరావతి : సీఎం చంద్రబాబు