Brain: మీరు నిద్రపోయాక అసలేం జరుగుతుంది? మీ బ్రెయిన్ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయో తెలుసా?

మామూలుగా మన నిద్ర పోయిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది? బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలని చాలామందికి కుతూహలం

  • Written By:
  • Publish Date - April 4, 2024 / 06:20 AM IST

మామూలుగా మన నిద్ర పోయిన తర్వాత మన శరీరంలో ఏం జరుగుతుంది? బ్రెయిన్ లో ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలని చాలామందికి కుతూహలంగా ఉంటుంది. మరి నిద్రపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మీ ఫ్రెండ్స్ సిగ్నల్స్ ఎక్కడికి వెళ్తాయో అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పగలంతా వ్యక్తులు ఆలోంచించే ఆలోచనల డేటా మొత్తాన్నీ రాత్రివేళ పడుకున్నప్పుడు బ్రెయిన్ ద్వారా ఏలియన్స్ సేకరిస్తున్నారనే డౌట్ చాలా మందికి ఉంది. అలా చేస్తున్నారు కాబట్టే రాత్రివేళ విచిత్రమైన కలలు వస్తున్నాయనీ, నిజానికి అవి కలలు కావనీ డేటా ఏలియన్స్‌కి వెళ్లిపోవడమే.. కలలాగా కనిపిస్తుందనే వాదన కొందరిలో ఉంది.

We’re now on WhatsApp. Click to Join
బ్రెయిన్ నిపుణులు మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. మనం నిద్రపోతున్నప్పుడు.. మన డేటా ఏదీ విశ్వానికి బ్రెయిన్ పంపదు అంటున్నారు. ఇదో తప్పుడు అభిప్రాయం అని చెబుతున్నారు. అసలు అలా జరగడానికి వీలు లేదు అంటున్నారు. బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది అంటున్నారు. మనం నిద్రపోయేటప్పుడు బ్రెయిన్‌ కొన్ని దశల్లోకి వెళ్తుంది. వాటిలో నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది ఒకటి. ఈ దశలో కళ్లు వేగంగా కదలవు. మరొకటి ర్యాపిడ్ ఐ మూమెంట్ ఈ దశలో కళ్లు వేగంగా కదులుతాయి. ఈ రెండు దశల్లోనూ కూడా మనం నిద్రపోతూనే ఉంటాం. అయితే ఈ దశల సమయంలో బ్రెయిన్ మన మెమరీని ప్రాసెస్ చేస్తుంది.

Also Reada: Tuesday: పొరపాటున కూడా మంగళవారం రోజు చేయకూడని పనులు ఇవే?

అంటే మనకు తాత్కాలికంగా గుర్తుండాల్సిన అంశాలు ఏంటి? శాశ్వతంగా గుర్తుండాల్సిన అంశాలు ఏంటి అనేది సెట్ చేసేస్తుంది. అలాగే మన ఆలోచనలను ఒక పద్ధతిలో సెట్ చేస్తుంది. అనవసరమైన ఆలోచనలను తొలగిస్తుంది. ఇలా చేస్తూ నిద్ర లేచేసరికి పూర్తిగా ఫ్రెష్‌గా చేస్తుంది. అయితే ఇక్కడ మనం ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ ముఖ్యమైన సమాచారాన్ని దాచేందుకు న్యూరాన్ల మధ్య కనెక్షన్లు పెడుతుంది. అలాగే అవసరం లేని సమాచారం తొలగించేందుకు కనెక్షన్లను తొలగిస్తుంది. తద్వారా లేచిన తర్వాత మనం మళ్లీ మరింత ఉత్సాహంతో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాము.

Also Read: Water Melon: పుచ్చకాయతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త?

అలాగే మనకు ఆహారం కంటే నిద్ర ఎక్కువ అవసరం. ఎందుకంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం వంటివి చేయడానికి నిద్ర అత్యవసరం. నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ ఈ పనులను సరిచేస్తూ మనకు అనుభవాలు, భావోద్వేగాలూ కలిగేలా చేస్తుంది. ఇలా మనం నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ ముఖ్యమైన పనులు చేస్తూనే మన శరీరంలోని అవయవాలకు విశ్రాంతి ఇస్తుంది. అలాగే తను కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అంతే తప్ప ఏ సమాచారాన్నీ ఎవరికీ చేరవేయదు. బ్రెయిన్ అనేది స్వతంత్రంగా పనిచేసే అవయవం. దాన్ని బయటి నుంచి ఏదీ కంట్రోల్ చెయ్యదు. బ్రెయిన్ ఎలా పనిచేస్తోందో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.