diabetes 6 foods : షుగర్ పేషెంట్లు ఉదయం లేవగానే తినాల్సిన 5 ఫుడ్స్

షుగర్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. ఇది ఉన్నవారు ఆహారం, పానీయాల (diabetes 6 foods)పై చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆలోచించకుండా ఏదైనా తింటే.. అది మీ రక్తంలో చక్కెర స్థాయిలో బ్యాలెన్స్ లెవల్ ను దెబ్బతీస్తుంది.

  • Written By:
  • Updated On - May 9, 2023 / 11:53 AM IST

షుగర్ అనేది జీవనశైలికి సంబంధించిన వ్యాధి. ఇది ఉన్నవారు ఆహారం, పానీయాల (diabetes 6 foods)పై చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఆలోచించకుండా ఏదైనా తింటే.. అది మీ రక్తంలో చక్కెర స్థాయిలో బ్యాలెన్స్ లెవల్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల షుగర్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్ ఏదైనా తినే ముందు.. తమ షుగర్, క్యాలరీలను చెక్ చేసుకోవాలి. మధుమేహ రోగుల విషయానికి వస్తే.. టిఫిన్ లో ఏమేం(diabetes 6 foods) తింటున్నారు అనేది చాల ముఖ్యం. రక్తంలో అధిక చక్కెర ఉన్న రోగులు ఖాళీ కడుపుతో ఏదీ తినకూడదు. ఇది వారి రక్తంలో చక్కెర స్థాయిని మరింతగా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు ఉదయం వేళ ఖాళీ కడుపుతో కొన్ని హాని కలిగించని ఫుడ్స్ మాత్రమే తినాలి. అలాంటి 6 ఫుడ్స్(diabetes 6 foods) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. జామూన్ జ్యూస్

తెల్లవారుజామున లేవగానే జామున్ జ్యూస్ తాగడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. జామూన్ జ్యూస్ లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. దాల్చిన చెక్క నీరు

దాల్చినచెక్క నీరు మన శరీరంలోని బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించే పవర్ ఫుల్ మసాలా. రాత్రి పడుకునే ముందు దాల్చిన చెక్కను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు దాని నీటిని తాగాలి. కావాలంటే దాల్చిన చెక్క నీళ్లతో హెర్బల్ టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రోజంతా మీ రక్తంలోని చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను అదుపులో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది.

3. మెంతి నీరు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి నీటిని తాగాలి. దీని కోసం ఒక చెంచా మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం మెంతులు తిని వాటి నీటిని తాగాలి.

ALSO READ: Diabetes: భారత్‌లో 73 శాతం మందికి షుగర్ వచ్చే ఛాన్స్!

4. మొలకెత్తిన మెంతులు

మొలకెత్తిన మెంతులు మీ షుగర్ లెవల్ ను తగ్గిస్తాయి. మొలకెత్తిన మెంతి పీచు రక్తంలో చక్కెర స్థాయిని తగిన స్థాయిలో మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది షుగర్ స్పైక్‌ను నివారిస్తుంది. డయాబెటిస్ నిర్వహణలో హెల్ప్ చేస్తుంది. జీవక్రియను సరిగ్గా ఉంచుతుంది. మధుమేహం వల్ల ఎదురయ్యే మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. మొలకెత్తిన మెంతికూరను ఉదయం సలాడ్‌లో చేర్చి లేదా నిమ్మకాయ, ఉప్పు వేసి తినొచ్చు.

5. కరివేపాకు

కరివేపాకు ఆకులను తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్‌ను యాక్టివేట్ చేస్తుంది. చక్కెరను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమలాలి లేదా దాని రసాన్ని తాగాలి.

6. బొప్పాయి

బొప్పాయి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. దాని వినియోగం మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.