4 Crore Deaths : ఈకాలంలో యాంటీ బయోటిక్స్‌ను ఎడాపెడా వాడేస్తున్నారు. మితిమీరిన స్థాయుల్లో యాంటీ బయోటిక్స్‌ను వాడిన వారిలో బ్యాక్టీరియా లేదా వ్యాధికారక జాతులు బలహీనపడటం లేదు. యాంటీ బయోటిక్స్‌ను తట్టుకొని అవి జీవించగలుగుతున్నాయి. దీనివల్ల ఆయా ఆరోగ్య సమస్యలు తగ్గే ఛాన్స్ లేకుండాపోతోంది. అలాంటి మొండి బ్యాక్టీరియాలు, వ్యాధికారక జాతులను సూపర్‌బగ్స్(4 Crore Deaths) అని పిలుస్తున్నారు. ఈ సూపర్ బగ్స్ వల్ల ఏర్పడే యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) ఇన్ఫెక్షన్లు ప్రపంచ ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి. యాంటీ బయోటిక్‌లను తట్టుకొని జీవిస్తున్న సూపర్‌బగ్‌ల వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ల కారణంగా రాబోయే 25 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు వివరాలతో ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ఓ అధ్యయన నివేదిక పబ్లిష్ అయింది.
Also Read :Commonwealth Games 2026: గ్లాస్గోలో 2026 కామన్వెల్త్ క్రీడలు!
అధ్యయన నివేదిక ప్రకారం..
- యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) వల్ల సంభవించిన ఇన్ఫెక్షన్ల కారణంగా 1990 నుంచి 2021 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా చనిపోయారు.
- సూపర్‌బగ్‌ల వల్ల ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 1990 నుంచి 2021 మధ్యకాలంలో 50 శాతానికిపైగా తగ్గాయి. శిశువుల్లో అంటు వ్యాధుల నివారణ, నియంత్రణకు అమలు చేసిన చర్యల వల్ల ఈ ఫలితం వచ్చింది.
- 1990 నుంచి 2021 మధ్యకాలంలో ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల వల్ల 70 ఏళ్లకు పైబడిన వారిలో సంభవించే మరణాలు 80 శాతం దాటాయి. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూపువారు ఏఎంఆర్ ఇన్ఫెక్షన్లను తట్టుకోలేకపోతున్నారు.
- మెథిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకస్ ఆరస్ (ఎంఆర్ఎస్ఏ) అనే రకానికి చెందిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించే మరణాలు గత 30 ఏళ్లలో డబుల్ అయి 1.30 లక్షలకు చేరాయి. యాంటీ బయోటిక్స్ రెసిస్టెన్స్ వల్లే ఈ మరణాలు సంభవించాయి.
Also Read :Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు
- ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల వల్ల సంభవించే మరణాలు 2050 నాటికి 67 శాతం పెరుగుతాయని.. ఆ సమయానికి ఏటా 20 లక్షల మంది చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ మోడలింగ్ ప్రాతిపదికనే మొత్తం రీసెర్చ్ జరిపారు. 2050 తర్వాత ఏఎంఆర్ ఇన్ఫెక్షన్ల వల్ల ఏటా 82 లక్షల మరణాలు సంభవించే ముప్పు ఉందని అంచనా వేశారు.
- ఒకవేళ పైన చెప్పుకున్నట్టే జరిగితే.. వచ్చే 25 ఏళ్లలో (2050 నాటికి) ఏఎంఆర్ వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమై సంభవించే మరణాల సంఖ్య 4 కోట్ల దాకా ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
- ఈ అధ్యయనంలో అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్‌కు చెందిన నిపుణులు పాల్గొన్నారు. స్టడీలో భాగంగా 22 వ్యాధి కారకాలు, 84 యాంటీ బయోటిక్స్, మెనింజైటిస్ వంటి 11 ఇన్ఫెక్షియస్ సిండ్రోమ్‌లను పరిశీలించారు. 204 దేశాలు, భూభాగాల్లోని 520 మిలియన్ల రోగుల వ్యక్తిగత రికార్డులను చెక్ చేశారు. ఇవన్నీ చూశాకే పై అంచనాలకు వచ్చారు.
- సెప్టెంబర్ 26న ఐక్యరాజ్యసమితిలో ఉన్నత స్థాయి AMR సమావేశం జరగనుంది. ఈనేపథ్యంలో విడుదలైన ఈ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.