Fact Checked By thequint
ఒక పక్షి నోటి నుంచి లేజర్ కిరణాలు వెలువడుతున్నట్టుగా.. ఆ కిరణాల్లోని నిప్పు కణాల ప్రభావంతో చుట్టుపక్కల కొద్ది భాగానికి నిప్పు అంటుకున్నట్లుగా చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో ఈ వీడియోను షూట్ చేశారని వైరల్ వీడియోలలో ఇటీవలే ప్రచారం చేశారు.
సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఏమిటి ? : ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేసిన వారు.. “అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో ఒక పక్షి కార్చిచ్చును రేపింది” అని రాసుకొచ్చారు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్‌ను ఇక్కడ చూడొచ్చు.
(అటువంటిదే ప్రచారం చేసిన మరిన్ని దావాల ఆర్కైవ్‌లను ఇక్కడ , ఇక్కడ , మరియు ఇక్కడ చూడొచ్చు .)
ఏది నిజం?: పైన మనం చెప్పుకున్న వీడియోలలో జరిగిన ప్రచారమంతా అబద్ధం. ఆ వీడియో ఇప్పటిది కాదు. 2020 సంవత్సరం నాటి వీడియో ఇది. బ్రెజీలియన్ VFX కళాకారుడు ఫాబ్రిసియో రబాచిమ్(Fact Check) విభిన్నమైన విజువల్ ఎఫెక్ట్‌లతో ఈ వీడియోను రూపొందించాడు. పక్షి నిప్పులు కక్కుతున్నట్టుగా VFX ఎఫెక్టులను జోడించాడు.
Also Read :Saif Ali Khan – Auto Rickshaw: సైఫ్ అలీఖాన్‌ను ఆటోలో ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లారు ? ఎవరు తీసుకెళ్లారు ?
వాస్తవం ఎలా తెలిసింది ?
మేం వీడియో ఫ్యాక్ట్‌చెక్‌లో భాగంగా ‘InVID’ అనే వీడియో వెరిఫికేషన్ టూల్‌ను వాడాం. దాని సహాయంతో వైరల్ క్లిప్‌ను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించాం. రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం.
- గూగుల్ సెర్చ్ చేయగా ఈ పక్షిని ‘సదరన్ లాప్‌వింగ్’ అని పిలుస్తారని తెలిసింది.
- ఈ పక్షిని బ్రెజిల్‌లో క్యూరో-క్వెరో అని పిలుస్తారని గుర్తించాం. ఈ పక్షి దక్షిణ అమెరికాలోని వివిధ ప్రాంతాలలోనూ కనిపిస్తుందని వెల్లడైంది.
- మేం వైరల్ క్లిప్ నుంచి కీఫ్రేమ్‌ను వికీమీడియా కామన్స్‌లో అప్లోడ్ చేసిన సదరన్ ల్యాప్వింగ్ యొక్క విజువల్‌తో పోల్చి చూశాం. రెండూ ఒకే విధంగా ఉన్నట్లు గుర్తించాం.
అసలు వీడియో గుర్తింపు జరిగింది ఇలా..
ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా WebQoof బృందం వివిధ పదబంధాలతో యూట్యూబ్‌లో కీవర్డ్ సెర్చింగ్ చేసింది. ఈక్రమంలో ఒక వీడియో దొరికింది. “quero-quero” అనే కీవర్డ్‌లతో ఆ వీడియో ఉంది. ఆ వీడియోను ‘Fabricio Rabachim’ పేరుతో ఉన్న ఒక YouTube ఛానల్‌లో ప్రచురించినట్లుగా మేం గుర్తించాం. ఈ వీడియో 2020 సంవత్సరం డిసెంబరు 14న పబ్లిష్ అయింది. ఆ వీడియోలో ఈ పక్షికి “క్యూరో-క్యూరో పవర్” అని పేరు పెట్టారు. ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క బయో ప్రకారం.. ఫాబ్రిషియో రబాచిమ్ (Fabricio Rabachim) అనే వ్యక్తి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నిపుణుడు.
Also Read :Caller ID Feature : ప్రతీ ఫోనులో కాలర్ ఐడీ ఫీచర్.. ట్రయల్స్ చేస్తున్న టెల్కోలు
వీడియో క్రియేటర్ ఏం చెప్పాడు ?
మేము ఇంతకుముందు 2021లో ఫాబ్రిషియో రబాచిమ్ (Fabricio Rabachim)ను సంప్రదించాం. ‘‘ఈ పక్షి అధిక శబ్దం చేయడంలో.. తన గూడును రక్షించుకునే క్రమంలో మనుషులకు దగ్గరగా ఎగరడంలో ఫేమస్’’ అని అతడు చెప్పాడు.
‘‘నేను ఈ పక్షి వీడియోను బ్రెజిల్‌లోని ఒక నగరంలో ఉన్న పార్కులో చిత్రీకరించాను. ఈ పక్షి తన గూడును కాపాడుకునేందుకు మనుషులను కూడా భయపెడుతుందని మాకు తెలిసింది. అందుకే నేను క్రియేటివ్‌గా దానికి కొన్ని వీఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్‌లను యాడ్ చేశాను. దాని కళ్ళలో లేజర్ కిరణాలను జోక్‌గా జోడించాను’’ అని ఫాబ్రిషియో రబాచిమ్ మాకు తెలిపాడు.
ముగింపు: వైరల్ అయిన పక్షి వీడియో చాలా పాతది. దానిలో చేసిన దావా తప్పు. ఆ పక్షి వల్ల లాస్ ఏంజెల్స్ నగరాన్ని కార్చిచ్చు కమ్ముకుందని జరిగిన ప్రచారంలో వాస్తవికత లేదు.