Fact Checked By newsmeter
ప్రచారం : మల్టీ లెవల్ రోడ్లు, భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్, ఎత్తైన భవనాల మధ్య జంక్షన్లతో ఒక ఫొటో వైరల్ అవుతోంది. అది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR ) ఫొటో అని ప్రచారం చేస్తున్నారు.
వాస్తవం : ఆ ప్రచారం తప్పు. అది ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ ఫొటో అని తేలింది.
Also Read :Man With 5 Kidneys: ఈయన శరీరంలో ఐదు కిడ్నీలు.. ఎవరు ? ఎలా ?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) అంటూ ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మల్టీ లెవల్ రోడ్లు ఉన్నాయి. ఒక భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్ వెళ్తోంది. ఎత్తైన భవనాల చుట్టూ రోడ్ జంక్షన్లు ఉన్నాయి. అది దేశంలోనే అతిపెద్ద రింగు రోడ్డు అని సోషల్ మీడియా పోస్టులలో రాశారు. హైదరాబాద్‌లోని ఆ రింగ్ రోడ్డు పొడవు 156 కిలోమీటర్లు అని ప్రస్తావించారు. ఈమేరకు వివరాలతో ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ చిత్రాన్ని షేర్ చేశారు . ( ఆర్కైవ్ )
- హైదరాబాద్ ఓఆర్ఆర్ పేరుతో వైరల్ అయిన ఫొటో నిజమైంది కాదని ‘న్యూస్‌మీటర్’ గుర్తించింది. ఆ ప్రచారం తప్పు. ఎందుకంటే ఆ ఫొటోను ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (AI) ద్వారా జనరేట్ చేశారని తేలింది.
- హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పొడవు (ORR) పొడవు 158 కి.మీ. ఇది మనదేశంలోనే పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే.
- వైరల్ అయిన ఫొటోకు సంబంధించిన కీవర్డ్‌లతో మేం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాం. దీంతో హైదరాబాద్ ORRకు చెందిన వివిధ ఫొటోలు, వీడియోలు వచ్చాయి. 2021 జూన్ 17న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన నెహ్రూ ORR డ్రోన్ ఫుటేజీ మాకు దొరికింది. అందులో రౌండ్అబౌట్‌లు, బహుళ స్థాయి ట్రాఫిక్ మార్గాలు ఉన్నాయి.
- తాజాగా వైరల్ అయిన హైదరాబాద్ ORR ఫొటో అనేది నిజమైన ఓఆర్ఆర్ ఫొటోతో సంబంధం లేని విధంగా ఉంది.
- ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఓఆర్‌ఆర్‌లో ఎక్కడ కూడా భవనం లోపలి నుంచి ఫ్లై ఓవర్లు వెళ్లవు.
- అందుకే హైదరాబాద్ ఓఆర్ఆర్ పేరుతో వైరల్ అయిన ఫొటోను ఏఐతో తయారు చేసి ఉండొచ్చని అనుమానించాం.
- మేం పలు ఏఐ ఫొటోలను పరిశీలించగా.. వైరల్ అయిన ఫొటో తరహాలోనే అసంపూర్తిగా ఉన్నాయి. రోడ్లు, జంక్షన్లు అకస్మాత్తుగా ముగిసి డెడ్ ఎండ్‌లకు దారితీశాయి. ట్రాఫిక్ ప్రవాహం దిశలో అసాధారణ సైజులున్న వాహనాలను వైరల్ ఫొటోలో గుర్తించాం.
- ఏఐ (AI) డిటెక్షన్ టూల్ అయిన ‘హైవ్ మోడరేషన్’ను వాడుకొని .. సదరు వైరల్ ఫొటోను మేం చెక్ చేశాం. దీంతో ఆ ఫొటో 99.9 శాతం AI- జనరేటెడ్ లేదా డీప్‌ఫేక్ ఫొటో అని తేలింది.
- మరొక AI డిటెక్షన్ టూల్ ‘సైట్ ఇంజిన్’లో(Fact Check) ఈ ఫొటోను తనిఖీ చేయగా.. వైరల్ అయిన ఫొటో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారైందని వెల్లడైంది.
అందుకే.. వైరల్ ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ తేల్చింది. AI ఫొటోను తయారు చేసి హైదరాబాద్ రింగ్ రోడ్ పేరుతో ప్రచారం చేశారు.