Fact Checked By newsmeter
ప్రచారం : డ్రగ్స్ సంబంధిత నేరాలు, ర్యాగింగ్, హత్య కేసుల దోషులకు మరణశిక్ష విధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
వాస్తవం : ఈ ప్రచారం తప్పు. వైరల్ అవుతున్న న్యూస్ కార్డ్ ఎడిట్ చేసినది. అమిత్ షా చేసిన అసలు ప్రకటనలో మరణశిక్ష గురించి ప్రస్తావనే లేదు.
Also Read :Dubai Gold : దుబాయ్ గోల్డ్.. ఎందుకు చౌక ? ఎంత తీసుకురావొచ్చు ?
ఫేస్‌బుక్ యూజర్ ఇలా రాశాడు
ఒక ఫేస్‌బుక్ యూజర్ ఈ న్యూస్ కార్డ్‌ను షేర్ చేస్తూ ఇలా రాశాడు.. “ఇది మంచి నిర్ణయం. దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా, ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. ధైర్యవంతుడైన నాయకుడు మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోగలడు. ప్రేక్షకుడిలా ప్రతీదాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు. మనకు చర్యలు తీసుకునే నాయకుడు కావాలి. మంచి నిర్ణయాలు తీసుకుంటున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి నా సంఘీభావం!” (మలయాళం నుంచి అనువదించబడింది) ( ఆర్కైవ్ )
వాస్తవ తనిఖీలో ఇలా..
- ఈ న్యూస్ కార్డ్‌ను(Fact Check) న్యూస్‌మీటర్ తనిఖీ చేసింది. దీంతో అందులో ఉన్న సమాచారం తప్పు అని తేలింది. వైరల్ అవుతున్న న్యూస్ కార్డ్‌ను ఎడిట్ చేసి, మార్పులు చేశారని గుర్తించాం. వాస్తవికంగా అమిత్ షా చేసిన ప్రకటనలో లేని అంశాలను అందులో చేర్చారు.
- ఆ న్యూస్ కార్డును మేం విశ్లేషించినప్పుడు వాక్య నిర్మాణంలో, ఉపయోగించిన అక్షరాల ఫాంట్‌లలో వ్యత్యాసాలు కనిపించాయి. దీని ప్రకారం అందులోని పంక్తులు అసలు న్యూస్ కార్డ్‌లో భాగం కాదని తేలింది. న్యూస్ కార్డ్ పైభాగంలో ఉన్న పంక్తులు మాదకద్రవ్యాలు, ర్యాగింగ్, హత్యలకు సంబంధించిన కేసుల్లో మరణశిక్ష గురించి ఉన్నాయి.
- మార్చి 2న జనమ్ టీవీ పోస్ట్ చేసిన అసలు న్యూస్ కార్డ్ మాకు దొరికింది. ‘‘మాదకద్రవ్యాల రహిత భారతదేశమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం’’ అని దానికి శీర్షిక ఉంది. ఈ న్యూస్ కార్డ్‌లో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, ర్యాగింగ్, హత్య కేసులకు షా మరణశిక్షను ప్రకటించారని పేర్కొనలేదు. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ లక్ష్యం డ్రగ్స్ రహిత భారతదేశం అని అమిత్ షా చేసిన ప్రకటన ఆధారంగా జనమ్ టీవీ కార్డ్‌ను రూపొందించారు.
- జనమ్ టీవీ తయారు చేసిన అసలైన న్యూస్ కార్డ్‌ను కొందరు ఎడిట్ చేసి, మరణశిక్ష గురించి లైన్లను జోడించారు. ఈవిషయాన్ని మేం నిర్ధారించాం. ఎడిట్ చేసిన న్యూస్ కార్డ్‌కు, అసలు న్యూస్ కార్డ్‌కు పోలికల్లో చాలా తేడాలు ఉన్నాయి.
Also Read :Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
- మార్చి 2న జనమ్ టీవీ యూట్యూబ్ ఛానల్లో ప్రచురించిన ఒక వీడియోను మేం చూశాము. ‘‘డ్రగ్స్ రహిత భారతదేశమే మా లక్ష్యం’’ అంటూ అమిత్ షా చేసిన X పోస్ట్ ఆధారంగా ఈ వీడియోను రూపొందించారు. అందులో ర్యాగింగ్ గురించి కానీ, హత్యల గురించి కానీ ప్రస్తావన లేదు. మరణశిక్ష గురించి కూడా ప్రస్తావన లేదు.
దేశవ్యాప్తంగా వివిధ కేసులను దర్యాప్తు చేసే క్రమంలో 29 డ్రగ్స్ ముఠాలు దొరికాయని, ఇలాంటి కఠినమైన చర్యలు కొనసాగుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో వైరల్ అవుతున్న న్యూస్ కార్డ్ ఫేక్ అని తేలింది. జనమ్ టీవీ రూపొందించిన అసలు న్యూస్ కార్డును ఎడిట్ చేసి, ఫేక్ కార్డును తయారు చేశారని వెల్లడైంది.