Worship Hanuman: ఈ దేవుడిని పూజిస్తే శని దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు?

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుంటుంటారు. అదేవిధంగా శని దేవుని ఆగ్రహానికి కారకులు కాకూడదు అని కూడా కోరుకుంటూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుడు ఆగ్రహానికి కారణమై కొన్ని

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 06:30 AM IST

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని యొక్క అనుగ్రహం కలగాలి అని కోరుకుంటుంటారు. అదేవిధంగా శని దేవుని ఆగ్రహానికి కారకులు కాకూడదు అని కూడా కోరుకుంటూ ఉంటారు. అలా తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల శని దేవుడు ఆగ్రహానికి కారణమై కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మరి శని మిమ్మల్ని చల్లగా చూడాలి అంటే ఏ దేవుని పూజించాలి. ఏ దేవుడిని పూజించడం వల్ల మీకు శని బాధలు తప్పి ఆ శని దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శనిదేవుని అనుగ్రహం కావాలి అనుకున్న వారు హనుమంతుడిని పూజిస్తే వారు తప్పకుండా శని దోషం నుంచి విముక్తిని పొందుతారు. అంతే కాకుండా హనుమంతుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని దేవుడు హనుమాన్ భక్తుల వైపు కన్నెత్తి కూడా చూడడు. అందుకోసం శనివారం రోజు హనుమాన్ చాలీసా అని పఠించడం ద్వారా శని ప్రభావం లేకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పరమశివుని భక్తుల వైపు కూడా శని కన్నెత్తి చూడడు. పురాణాల ప్రకారం శివుడు శని దేవుడిని రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందున శనికి రావిచెట్టు అంటే భయం.

అందుకే శనివారం రోజు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో అటువంటి వారి వైపు శని దేవుడు కన్నెత్తి కూడా చూడడు. కాబట్టి ఎవరైతే శని దేవుడు కూడా చల్లగా చూడాలి అని కోరుకుంటారు అటువంటివారు హనుమంతుని పూజించడం మేలు. అదేవిధంగా శివుని పూజించడం కూడా ఎంతో మేలు. అంతేకాకుండా శని దేవునికి ఎంతో భయమైన రావి చెట్టును కూడా పూజించడం వల్ల శని దేవుని నుంచి వచ్చే సమస్యలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.