Temple: మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదు మీకు తెలుసా?

చాలామంది ప్రతిరోజూ కూడా ఆ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు పండగ రోజుల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే దేవాలయాలకు వెళుతూ ఉం

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 05:00 PM IST

చాలామంది ప్రతిరోజూ కూడా ఆ దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు పండగ రోజుల్లో విశేషమైన రోజుల్లో మాత్రమే దేవాలయాలకు వెళుతూ ఉంటారు. అయితే దేవాలయానికి ఎక్కువ శాతం ఉదయం లేదంటే సాయంత్రం సమయంలో ఎక్కువగా వెళుతూ ఉంటారు. మధ్యాహ్నం సమయంలో చాలామంది వెళ్లరు. అంతే కాకుండా మధ్యాహ్నం సమయంలో చాలా వరకు దేవాలయాలు మూసివేసి ఉంటాయి. కాగా ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం పూట గుడికి వెళ్లకూడదని పండితులు చెబుతూ ఉంటారు.

కానీ దీని వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు. మరి మధ్యాహ్న సమయంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధ్యాహ్నం గుడికి వెళ్లడం నిషిద్ధం వెనుక మూడు బలమైన కారణాలు ఉన్నాయట. అందులో మొదటి కారణం.. మధ్యాహ్నం మన శరీరం సోమరిగా ఉంటుంది. మన మెదడు నిద్రమత్తులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మధ్యాహ్నం సోమరితనం నిండిన మనస్సుతో దేవుడిని చూడకూడదని అంటారు. రెండో కారణం మధ్యాహ్నం స్వామికి నిద్రించే సమయం. కాబట్టి చాలా దేవాలయాల తలుపులు మధ్యాహ్నానికి మూసివేయబడతాయి. మధ్యాహ్న పూట స్వామివారు గుడిలో సేదతీరుతారు.

ఇలాంటి సమయంలో మీరు గుడికి వెళితే దేవుని నిద్రకు ఆటంకం కలుగుతుంది. ఉదయం, సాయంత్రం పూటే ఆలయాన్ని సందర్శించేవాళ్లు మానవులు, పవిత్ర జీవులు. మధ్యాహ్నం దెయ్యాలు, పూర్వీకులు, తీరని ఆత్మల కాలమని నమ్ముతారు. ఇలాంటి సమయంలో స్వామి దర్శనం కోసం ఆలయంలో కనిపించని శక్తులు ఉంటాయి. వీళ్లకు బాధల నుంచి విముక్తి, మోక్షం లభిస్తుంది. మధ్యాహ్నం పూట గుడికి వెళ్లినప్పుడు మన కంటికి కనిపించని శక్తులకు, భగవంతుడికి మధ్య జరిగే సమావేశానికి ఆటంకం ఏర్పడుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మధ్యాహ్నం దేవాలయాలు తెరిచే ఉన్నప్పటికీ భక్తులు వెళ్లకూడదు.