Onion – Garlic : పండుగలు, పూజల టైంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ?

Onion - Garlic :  పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో ఆహార నియమాలు ఉంటాయి.

Published By: HashtagU Telugu Desk
Onion Garlic

Onion Garlic

Onion – Garlic :  పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో ఆహార నియమాలు ఉంటాయి. ఈసందర్భాల్లో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి , ఇతర మసాలా పదార్థాలేవీ  తినరు. సాత్వికాహారం మాత్రమే తింటారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధించేవారంతా ఈ నియమాలు పాటిస్తారు. ఇందుకు కారణం ఏమిటి  అనేది తెలుసుకోవాలంటే.. రాజసిక ఆహారం గురించి అవగాహనకు రావాలి. రాజసిక ఆహారంలో మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. వీటిని తింటే తక్షణ శక్తి లభిస్తుంది.  కానీ శరీర సమతుల్యత గాడి తప్పుతుంది. జీర్ణవ్యవస్థ బలహీనంగా తయారవుతుంది. వీటిని తినడానికి ఎంత ఆతురత ఉంటుందో… అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన వంటివి కలుగుతాయి. అందుకే పండుగలు, పూజలు, ప్రత్యేక సమయాల్లో ఉల్లి, వెల్లుల్లి తినొద్దని చెబుతారు.  రజోగుణం అనేది అహానికి ప్రతీక.  ఉల్లి, వెల్లుల్లి తింటే రజోగుణం వస్తుందని అంటారు. ఈ గుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు.  ఎప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపనతో ఉంటాడు.

We’re now on WhatsApp. Click to Join.

సాత్విక ఆహారం, తామసిక ఆహారం.. 

సాత్విక ఆహారం అంటే.. స్వచ్ఛమైన శాకాహారం. ఇందులో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును, శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది. సాత్విక ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. ఇక తామసిక ఆహారంలో మళ్లీమళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు  ఉంటాయి. వీటిని తినేవారు బద్దకంగా, నిస్తేజంగా, జీవితం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచన(Onion – Garlic) వీరి దరిచేరదు.

Also Read: Benefits Of Red Grapes: మీరు ఎర్ర ద్రాక్షలను తినలేదో.. ఈ లాభాలు మిస్ అయినట్టే..!

గమనిక: ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.

  Last Updated: 21 Oct 2023, 01:02 PM IST