Lord Shiva Tulsi leaves : శివ పూజలో తులసి ఎందుకు నిషిద్ధమో.. తెలుసా ?

సోమవారం శివునికి అంకితం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రతి సోమవారం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈసందర్భంగా శివుడిని(Lord Shiva Tulsi leaves) పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వు, బిల్వ పత్రం (మారేడు ఆకు), మందార పువ్వు, జిల్లెడు పువ్వు, గులాబీ పువ్వులు, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు, తామర పువ్వులు సమర్పిస్తుంటారు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 01:13 PM IST

సోమవారం శివునికి అంకితం. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రతి సోమవారం రోజున ఉపవాసం పాటిస్తారు. ఈసందర్భంగా శివుడిని(Lord Shiva Tulsi leaves) పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వు, బిల్వ పత్రం (మారేడు ఆకు), మందార పువ్వు, జిల్లెడు పువ్వు, గులాబీ పువ్వులు, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు, తామర పువ్వులు సమర్పిస్తుంటారు. కానీ తులసి ఆకులను (Lord Shiva Tulsi leaves) మాత్రం శివుడికి సమర్పించరు. సాధారణంగా అందరు దేవతలను పూజించేటప్పుడు తులసిని నైవేద్యంగా పెడతారు. కానీ శివుడికి తులసి ఆకులను ఎందుకు సమర్పించకూడదు అనేది తెలుసుకోవాలనుంటే మనం పురాణ గాధల్లోకి వెళ్ళాలి.. శివపురాణంలోని ఒక కథను తెలుసుకోవాలి..

పూర్వ జన్మలో తులసి ..

శివపురాణం ప్రకారం.. తులసి(Lord Shiva Tulsi leaves)ని పొరపాటున కూడా శివుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల భక్తులు శివుడి ఆగ్రహానికి గురవుతారు. శివుడు, తులసికి సంబంధించిన సమాచారం శివపురాణంలో ఉంది. పూర్వ జన్మలో తులసి పేరు వృంద . ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య. ఇక జలంధరుడి విషయానికి వస్తే అతడు.. శివుడి మూడో కన్ను నుంచి బయటికి వచ్చిన క్రోధాగ్ని నుంచి పుట్టాడు. జలంధరుడు ప్రజలను చాలా హింసించేవాడు. అతడు ఎంతటి దారుణానికి ఒడిగట్టినా ఎవరూ చంపే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే అతని భార్య వృంద ఎంతో ధర్మబద్ధమైంది. అటువంటి పరిస్థితిలో ప్రజలను జలంధరుడి దౌర్జన్యం నుంచి రక్షించడానికి విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరిస్తాడు.

also read : Tulasi pooja 2022: తులసి పూజ శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత..!!

ఓ వైపు యుద్ధం.. మరోవైపు విష్ణుమాయ

ఓ వైపు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా.. మరోవైపు జలంధరుడి రూపాన్ని ధరించిన విష్ణువు వృంద వద్దకు వస్తాడు. వృంద(Lord Shiva Tulsi leaves) అతన్ని గుర్తుపట్టలేక జలంధరుడు అని భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే.. ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో వృంద పతివ్రత నిష్ట భగ్నం అయి.. శివుడితో యుద్ధంలో ఉన్న జలంధరుడు బలహీనుడవుతాడు. శివుడి చేతిలో చనిపోతాడు. తన తప్పు తెలుసుకుని.. వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. తాను పూజించిన దేవుడే తనని మాయ చేసాడని తెలిసి బాధపడుతుంది. అనంతరం వృంద స్వీయ దహనానికి పాల్పడుతుంది. ఈక్రమంలో తన భర్త మరణ వార్త తెలుసుకొని.. శివుడిని వృంద శపిస్తుంది. వృంద శాపం కారణంగానే .. తులసి ఆకులను శివుడికి సమర్పించరు. రాయి కావాలంటూ మహావిష్ణువును వృంద శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఇక వృంద స్వీయ దహనం చేసుకున్న చోట తులసి మొక్క పెరిగింది. వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి.. ఆమె తులసిగా పిలవబడి తనతో పాటు పూజించబడుతుందని వరం ఇస్తాడు. అందుకే తులసి ఆకు లేనిదే విష్ణు పూజ పూర్తవ్వదు.

శివునికి సమర్పించడానికి నిషేధించబడిన ఇవీ

పసుపు : పసుపు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అనేక పవిత్రమైన సందర్భాలలో ఉపయోగించబడుతుంది. కానీ దీన్ని శివలింగానికి సమర్పించరు.

కుంకుమ : కుంకుమను అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. శివుడు ఏకాంతాన్ని ఇష్టపడతాడు. అందుకే కుంకుమను శివలింగానికి సమర్పించకూడదు.

విరిగిన బియ్యం: పూజ చేసేటప్పుడు.. విరిగిన అన్నాన్ని సమర్పించడం అపవిత్రంగా పరిగణించబడుతుంది. కాబట్టి శివలింగంపై ఎప్పుడూ అక్షత అంటే తృణధాన్యాలు మాత్రమే సమర్పించాలి.