Kartika Masam : నేటి నుంచి కార్తీకమాసం.. ఈ మాసంలో తులసి పూజ విశిష్టత ఇదీ

Kartika Masam : శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఇవాళ (నవంబరు 14) ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 12:30 PM IST

Kartika Masam : శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ఇవాళ (నవంబరు 14) ప్రారంభమైంది. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండే మాసం ఇది. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో అగ్ని సంబంధమైన దీపారాధన చేస్తారు. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. కార్తీకమాసంలో విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు, మహా లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కకు పూజలు చేస్తారు. తులసి మొక్కకు పూజలు చేయడం వల్ల కలిగే ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • తులసి మొక్క మూలంలో సర్వ తీర్థాలు, మధ్యభాగంలో సమస్త దేవతలు, తులసి మొక్క పైభాగంలో సర్వ వేదాలతో కొలువై ఉన్న లక్ష్మీదేవి ఉంటారు. అందుకే కార్తీక మాసంలో తులసి పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్టే అని చెబుతున్నారు.
  • కార్తీకమాసంలో తులసిని పూజించడం వల్ల మోక్ష సిద్ధి కలుగుతుందని, వైకుంఠానికి నేరుగా చేరే అవకాశం దొరుకుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
  • నిత్యం తులసి మొక్కను పూజించే ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని, తులసిని పూజించిన వారికి మానసిక ప్రశాంతత కలుగుతుందని చెబుతారు.
  • కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి కొమ్మకూ, తులసి మొక్కకు వివాహం చేస్తారు. దీన్ని విష్ణువు కు లక్ష్మికి జరిగిన వివాహంగా పరిగణిస్తారు.
  • తులసి మొక్కను దక్షిణం వైపు నాటకూడదు. ఎందుకంటే ఈ దిశ యమ భగవానుడు, పూర్వీకులకు సంబంధించినది.ఈ దిశలో తులసిని నాటితే ఇంట్లో వాస్తు దోషాలు పెరుగుతాయి.
  • ఇంటికి ఉత్తరం లేదా తూర్పు, ఈశాన్య దిశలలో ఏదో ఒకవైపు తులసి మొక్కను నాటడం శుభప్రదం. మీరు బాల్కనీ లేదా కిటికీలో తులసి మొక్కను నాటుతున్నట్లయితే.. దాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచండి. ఈ దిశను లక్ష్మి, గణేశుడు, కుబేరుడు దిక్కుగా(Kartika Masam) భావిస్తారు.

Also Read: Ginger: బరువు తగ్గాలని చూస్తున్నారా.. అయితే అల్లం సాయం తీసుకోండిలా..!

గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాన్ని వినియోగదారులు కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.