Billionaire To Monk : ఈ ప్రపంచమే పెద్ద వింత. అందులో నివసించే కొందరు మనుషులు ఇంకా పెద్ద వింత. ఎందుకంటే వారి నిర్ణయాలు చాలా వెరైటీగా ఉంటాయి. అందరినీ అవాక్కయ్యేలా చేసే నిర్ణయాలను ఆ కొందరు తీసుకుంటుంటారు. ప్రాచీన కాలం నాటి మహా పురుషుల(Billionaire To Monk) నిర్ణయాలు అత్యద్భుతం. మహా పురుషుల బాటలో నడవాలనే ఏకైక సంకల్పంతో అసాధారణ నిర్ణయాలు తీసుకునే గొప్ప వ్యక్తులు ఈ కలికాలంలోనూ ఉన్నారు. అలాంటి ఓ మనిషి, మహర్షి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Musi River Project : ‘మూసీ రివర్ ఫ్రంట్’ గురించి పార్లమెంటులో ప్రస్తావన.. బీఆర్ఎస్ ఎంపీకి కేంద్ర మంత్రి సమాధానం
- అజన్ సిరిపన్యో (Ajahn Siripanyo).. ఈ పేరు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
- అజన్ సిరిపన్యో అనే కుర్రాడి వయసు 21 సంవత్సరాలు.
- ఈ యువకుడు గౌతమబుద్ధుడి స్ఫూర్తితో సన్యాసిగా మారిపోయాడు.
- చాలామంది యువత బౌద్ధ సన్యాసులుగా మారుతున్నారు. అయితే అజన్ సిరిపన్యో ఎందుకు స్పెషల్ అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం అతడి ఆస్తిలో ఉంది.
- అజన్ సిరిపన్యో తండ్రి పేరు ఆనంద్ కృష్ణన్. ఈయన శ్రీలంక- తమిళ సంతతికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం మలేషియాలో బిలియనీర్ వ్యాపారవేత్త. మలేషియాలోని అత్యంత ధనికుల లిస్టులో మూడో ప్లేసులో ఆనంద్ కృష్ణన్ ఉన్నారు. ఈయనకు రూ. 40 వేల కోట్లు విలువైన వ్యాపారాలు ఉన్నాయి.
- ఆనంద్ కృష్ణన్‌కు టెలికాం, శాటిలైట్స్, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి.
- ఒకప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు స్పాన్సర్ చేసిన ఎయిర్‌సెల్ కంపెనీ కూడా ఆనంద్ కృష్ణన్‌దే.
- 18 ఏళ్లు వచ్చే వరకు అజన్ సిరిపన్యో తన ఇద్దరు సోదరీమణులతో కలిసి లండన్‌లో చదువుకున్నాడు. ఆ టైంలోనే ఎనిమిది భాషలను నేర్చుకున్నాడు.
- అజన్ సిరిపన్యో తల్లి మామ్వాజారోగీస్ సుప్రిందా చక్రబన్.. థాయ్‌లాండ్ రాజకుటుంబానికి చెందిన వనిత.
- అజన్ సిరిపన్యో తన 18వ ఏట తల్లి కుటుంబ సభ్యులను కలిసేందుకు థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. అక్కడే ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు. సన్యాసిగా మారారు. ప్రస్తుతం స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి సేవ చేస్తున్నారు. మయన్మార్-థాయ్‌లాండ్ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో మఠాధిపతిగా ఉంటున్నారు.
- కుమారుడు అజన్ తీసుకున్న నిర్ణయంతో ఆనంద్ కృష్ణన్ షాక్‌కు గురయ్యారు. అయితే ఆ నిర్ణయాన్ని ఆయన గౌరవించారు.