apara ekadashi 2023 : సర్వ పాపాల నుంచి విముక్తికి “అపర ఏకాదశి”.. ఎప్పుడంటే ?

జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తేదీని "అపర ఏకాదశి" (apara ekadashi 2023) అంటారు. దీన్ని అజల ఏకాదశి (నీరు లేకుండా ఉపవాసం చేసే ఏకాదశి) అని కూడా పిలుస్తారు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 01:47 PM IST

జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి తేదీని “అపర ఏకాదశి” (apara ekadashi 2023) అంటారు. దీన్ని అజల ఏకాదశి (నీరు లేకుండా ఉపవాసం చేసే ఏకాదశి) అని కూడా పిలుస్తారు. ఈసందర్భంగా శ్రీమహావిష్ణువు, లక్ష్మిదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అపర ఏకాదశి (apara ekadashi 2023) రోజున వామన అవతారంలో ఉన్న విష్ణువును ఎవరైతే ఆరాధిస్తారో వారు సర్వ పాపాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. అపర ఏకాదశి రోజున నదీ స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని అంటారు. అపర ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వ్యక్తి తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేయాలి. ఉపవాసం ప్రారంభించడానికి ముందు శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాసం పాటించే వారు సూర్యాస్తమయం వరకూ ఆహారం తీసుకోకూడదు. ఈసందర్భంగా సాయంత్రం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారాన్ని తినాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారాన్ని తినకూడదు.

also read : Devshayani Ekadashi: శ్రీమహావిష్ణువు 117 రోజులు నిద్రించడం వెనక రహస్యం ఏంటి..!!

అపర ఏకాదశి ఉపవాస శుభ సమయం..

పంచాంగం ప్రకారం.. అపర ఏకాదశి ఈ ఏడాది మే 15న (సోమవారం) వస్తుంది. ఆ రోజు తెల్లవారుజామున 02:46 గంటలకు అపర ఏకాదశి ప్రారంభమవుతుంది. ఇది మరుసటి రోజు అంటే మే 16న ఉదయం 01.03 గంటలకు ముగుస్తుంది. మే 16న ఉదయం 06:41 నుంచి 08:13 గంటల వరకు ఉపవాసం ఉండే శుభ సమయం ఉంటుంది.ఈ ఉపవాసం వల్ల మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి.