Punyakalam : ఉత్తరాయణం, దక్షిణాయణం, పుణ్యకాలం.. అనే పదాలను తరుచుగా మనం వింటుంటాం. ఇంతకీ ఈ పదాల అర్థం ఏమిటి ? వీటిని ఏ సందర్భంలో వినియోగిస్తారు ? ఏ అంశానికి సూచికలుగా ఈ పదాలు నిలుస్తాయి ? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
సూర్యుడు ఏడాదికి రెండుసార్లు తన దిశను మార్చుకుంటాడు. ఈశాన్యానికి దగ్గరగా సూర్యుడు ఉదయించే కాలాన్ని ‘ఉత్తరాయణం’ అంటారు. ఆగ్నేయానికి దగ్గరగా సూర్యుడు ఉదయించే కాలాన్ని ‘దక్షిణాయణం’ అంటారు. ఉత్తరాయణాన్ని వేసవి కాలంగా, దక్షిణాయణాన్ని రుతుపవన కాలంగా పిలుస్తారు. ఉత్తరాయణంలో పగటి సమయం ఎక్కువగా.. దక్షిణాయణంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. దక్షిణాయణం ప్రారంభమయ్యే టైంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతారు. అందుకే ఉత్తరాయణ కాలంలో పండుగలు, జాతరలు, తీర్థయాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఈ కాలాన్ని దేవతారాధన, దానాలు, ధర్మాలు, వివాహాలకు అనుకూలమైన టైంగా పండితులు చెబుతుంటారు.
Also Read :Four Soldiers Killed : ఉగ్రవాదుల కాల్పులు.. అమరులైన నలుగురు సైనికులు
దక్షిణాయణం(Dakshinayana Punyakalam) అనేది పితృదేవతల ఆరాధనకు ఉత్తమ సమయం. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యేది ఈ టైంలోనే. సంతానం సమర్పించే తర్పణాలను స్వీకరించి పితృదేవతలు సంతృప్తి చెందితే కుటుంబం వికాసానికి దారులు తెరుచుకుంటాయి. కర్కాటక సంక్రాంతి రోజు నదీస్నానం ఆచరించి దానధర్మాలు చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. నదీస్నానం చేయడం వీలుకాని వారు.. నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయొచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. వేదపండితులకు స్వయంపాక సమర్పించి,పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. దక్షిణాయణ కాలంలో భూమిపై సూర్యకాంతి తక్కువగా ప్రసరిస్తుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే రిస్క్ ఉంటుంది. అవి దరిచేరకుండా ఉండాలంటే.. మనం ఆరోగ్య నియమాలను పాటించాలి. దైవ ధ్యానం చేయాలి.
Also Read :Usha Chilukuri Vance : అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే !
ఉత్తరాయణకాలంను పుణ్యకాలంగా(Punyakalam) హిందువులు భావిస్తుంటారు. సమస్త ఋషులకూ, దేవతలకూ, పండితులకూ ఉత్తర భూములే నివాస స్థానాలు కావటం వల్ల ఈ విశిష్టత వచ్చిందని చెబుతారు. సాధారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం జనవరి 15 నుంచి జూలై 17 వరకు ఉంటుంది. దక్షిణాయణం జూలై 17 నుంచి జనవరి 14 వరకు ఉంటుంది.
Also Read :Cricketers Apology: చిక్కుల్లో యువీ,రైనా,భజ్జీ వీడియో డిలీట్, క్షమాపణలు చెప్పిన క్రికెటర్లు
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.