మామూలుగా మనము కొన్ని కొన్ని సార్లు ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా ఏదో ఒక రకంగా అడ్డంకులు ఏర్పడి ఆటంకాలు వచ్చి ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఏవో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడుతూనే ఉంటాయి. దాంతో చాలామంది నిరాశపడుతూ ఉంటారు.. ఏం చేయాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని రకాల పాటిస్తే ఎన్ని అడ్డంకులు ఏర్పడినా కూడా అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయట. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే..
మనం ఏ పని ప్రారంభించినా, అందులో విజయం సాధించడానికి, ఆటంకాలు తొలగిపోవడానికి పసుపు పరిహారం పాటిస్తే మంచిదట. పని మొదలు పెట్టేముందు 3 పసుపు పొట్లాలను వెంట తీసుకెళ్లాలట. అంటే కొంచెం పసుపును పేపర్ లో పొట్లం లాగా చుట్టుకోవాలి. అలా మూడు పసుపు పొట్లాలు సిద్ధం చేసుకోవాలట. మొదటి పొట్లాన్ని దగ్గరలోని ఏదైనా దేవాలయంలో ఉంచాలి. రెండో పొట్లాన్ని ఎక్కడైనా పారే నీటిలో వదలాలి. మూడో పొట్లాన్ని మాత్రం మీ దగ్గరే ఉంచుకోవాలట. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పని విజయవంతంగా పూర్తవుతుందట. పని పూర్తయిన తర్వాత మీ దగ్గర ఉన్న పసుపు పొట్లాన్ని మర్రి లేదా రావి లేదా వేప చెట్టు మొదట్లో పెట్టి నమస్కారం చేసుకుని ఇంటికి తిరిగి రావాలని చెబుతున్నారు.
అలాగే ఏదైన ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లినప్పుడు అది పూర్తిగా సక్సెస్ కావాలంటే 14 మిరియాలను తీసుకుని గడప బయటి వైపు 7 ఉంచి, గడప లోపలి వైపు మిగిలిన 7 మిరియాలు ఉంచాలట. ఆ తర్వాత వాటిని దాటి బయటికి వెళ్లాలట. మీరు బయటికి వెళ్లిన తర్వాత ఆ మిరియాలను తీసి ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయమని ఇంట్లో ఉన్నవారికి చెప్పాలట. ఇలా చేయడం వల్ల చేసే కార్యంలో విజయం లభిస్తుందని చెబుతున్నారు.