Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మార్చి 16 నుంచి మార్చి 22 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Lex Fridman : ప్రధాని మోడీని ఇంటర్వ్యూ చేసిన లెక్స్ ఫ్రిడ్‌మన్.. ఎవరు ?
మేషం
ఈ వారంలో మేష రాశి(Weekly Horoscope) వారు ఆర్థికంగా బలోపేతం అవుతారు. అప్పులు తీరుతాయి. ఆస్తుల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇతరులకు డబ్బు విషయంలో వాగ్దానం ఇవ్వకండి. కొత్త ఒప్పందాల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంత తడబడతారు. కొత్త వ్యాపారానికి ఇది మంచి సమయం. మిత్రులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన చేస్తారు. కానీ తొందరొద్దు.
వృషభం
ఈ వారంలో వృషభ రాశి వారికి చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు. వెంటనే ఆ సలహాలను ఫాలో అయిపోవద్దు. మీ సొంత మైండ్‌తోనే నిర్ణయాలు తీసుకోండి. కన్నవారు, జీవిత భాగస్వామి సలహాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి. ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు. కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు ఎదురవుతాయి. మీ నిర్ణయమే మీ జీవితం మారుస్తుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. భయపడొద్దు.
మిథునం
ఈవారంలో మిథున రాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. డబ్బు, ఖ్యాతి ఆధారంగా స్నేహాలు పెంచుకోవద్దు. మంచి నేపథ్యం ఉన్నవారికే చేరువ కండి. లేదంటే చేటు జరగొచ్చు. ఒకటికి మించి ఉద్యోగ ఆఫర్లు ఏకకాలంలో వస్తాయి. ఆచితూచి ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకోండి. ఇప్పటికే ఆ తరహా జాబ్స్ చేస్తున్న వారి సలహాలు తీసుకోండి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు వస్తాయి. దుబారా ఖర్చులు వద్దు.
Also Read :Aamir Khan : ఆల్రెడీ ముగ్గురు భార్యలతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్లిన ఆమీర్ ఖాన్..
కర్కాటకం
ఈవారంలో కర్కాటక రాశి వారికి ఆస్తి వివాదాల్లో పరిష్కారం లభిస్తుంది. షేర్ మార్కెట్‌లో దూకుడును ప్రదర్శిస్తే భారీ నష్టాలను చూస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి నష్టాలు రావొచ్చు. పెట్టుబడి నిర్ణయాల్లో అత్యుత్సాహం, అతి విశ్వాసం వద్దు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరిస్తే నష్టమే జరుగుతుంది.
సింహం
ఈవారంలో సింహ రాశిలోని పలువురు ఇతరులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. ఇతరుల మాటలను, హామీలను వెంటనే నమ్మొద్దు. వాటిని క్రాస్ చెక్ చేయండి. ఆకస్మికంగా వ్యాపారంలో, ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి. వీలైనంత దుబారా అరికట్టండి. ప్రయాణంలో జాగ్రత్త. వేగవంతమైన డ్రైవింగ్ వద్దు. కుటుంబ బాధ్యత ఒకటి నెరవేరుస్తారు.
కన్య
ఈవారంలో కన్య రాశివారి వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపం దరిచేరనివ్వొద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మానసిక ప్రశాంతతను హరిస్తుంది. తొందరపాటుతో ఏదీ మాట్లాడొద్దు. అన్నింటికీ కాలమే సమాధానం ఇస్తుందని గుర్తుంచుకోండి. మీపై, మీ మాటలపై స్వీయ నియంత్రణ పెంచుకోండి. తప్పకుండా మీలో ఒక నాయకుడు ఉద్భవిస్తాడు. ఉద్యోగంలో పదోన్నతి రావొచ్చు.
తుల
ఈవారంలో తుల రాశి వారి చేతినిండా డబ్బు ఉంటుంది. దుబారాకు పోతే రాబోయే కాలంలో కష్టాలు తప్పవు. విలాసాలకు పోవద్దు. సన్నిహితులకు ఆపద సమయంలో సాయం చేయండి. కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఆ వ్యాపారం లోతుపాతుల గురించి ముందే కొంత తెలుసుకోండి. నిరుద్యోగులు తీపి కబురు వింటారు. దూర ప్రయాణాలు వద్దు.
వృశ్చికం
ఈ వారంలో వృశ్చిక రాశి వారు తమ పిల్లల ప్రగతిని చూసి సంతోషిస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. పార్ట్‌నర్‌షిప్‌లో వ్యాపారం చేసే వారికి బ్యాడ్ టైం. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. కొత్త పరిచయాలు చేటు చేయొచ్చు.
ధనుస్సు
ఈవారంలో ధనుస్సు రాశిలోని పలువురు ఉద్యోగం మారుతారు. కొందరు వ్యాపారులు తమ వ్యాపార సంస్థ ఆఫీసును మారుస్తారు. సరైన ముహూర్తాల గురించి తెలుసుకొని, పాటించండి. ఇంట్లో, వ్యాపారంలో, ఉద్యోగంలో మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. ఈసమయంలో మీకు పనికొచ్చేది దైవబలం మాత్రమే. దైవ్యాన్ని తలచుకొని ధ్యానించండి. ఇంటి ఖర్చులు, వ్యాపార ఖర్చులు పెరుగుతాయి.
మకరం
ఈవారంలో మకరరాశి వారు ఆర్థికంగా బలపడతారు. అతి విశ్వాసానికి పోవద్దు. దుబారా ఖర్చులు చేయొద్దు. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి టైం. జీవిత భాగస్వామితో ప్రేమపూర్వకంగా ఉండండి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టు మొదలుపెడతారు. సరైన ప్లానింగ్ చేయండి. విజయం కావాలంటే నిపుణులను సంప్రదించండి.
కుంభం
ఈవారంలో కుంభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. పాత అప్పులు వసూలు అవుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. శ్రమించనిదే ఫలితం రాదు. ఏ పని అయినా.. అంకిత భావంతో చేయండి. ఉద్యోగం మారేందుకు ప్రయత్నిస్తారు.
మీనం
ఈవారంలో మీన రాశి వారు సుదూర ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఉద్యోగంలో ఉన్న వారికి కీలక బాధ్యతలను అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు పండుతాయి. కొత్తగా ఆలోచిస్తే మరిన్ని అవకాశాలు కనిపిస్తాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.