Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?
మేషరాశి
ఈ వారంలో మేషరాశి(Weekly Horoscope) వారికి ప్రేమ వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకుంటే బెటర్. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కోపం వద్దు. సెల్ఫ్ కంట్రోల్ అవసరం. ఓపికగా, సహనంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా విజయం మిమ్మల్నే వరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి కలిసొస్తుంది.
వృషభ రాశి
ఈవారంలో వృషభ రాశి వారు పలు కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి. ఆర్థికంగా కొంత కుదుటపడతారు. అప్పులు రికవర్ అవుతాయి. కొత్త ఆస్తులు కొంటారు. పిల్లల చదువులను, స్నేహాలను మానిటర్ చేయండి. వారితో ఫ్రెండ్లీగా మాట్లాడండి. చాలా విషయాలు తెలుస్తాయి.
మిథునరాశి
ఈ వారంలో మిథున రాశి వారు కొన్నిరంగాల్లో సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యాపారాల్లోనూ ఒడిదొడుకులు ఉంటాయి. కొత్త వస్తువులు కొంటారు. అయితే అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి. విలాసాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా దుబారా జరగకుండా జాగ్రత్తపడండి. వ్యాపార ప్రణాళికలను జాగ్రత్తగా రెడీ చేయండి. బాగా అధ్యయనం చేయండి. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోండి.
Also Read :Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమం.. ఆయన నేపథ్యం ఇదీ..
కర్కాటకం
ఈవారంలో కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం ఉంది. కొన్ని విషయాల్లో లక్ కలిసొస్తుంది. అయితే దాన్ని మైండ్‌లో పెట్టుకొని అత్యుత్సాహాన్ని, అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించకండి. మీ పని మీరు కంటిన్యూ చేయండి. ఎవరితోనూ అనవసరంగా, అతిగా మాట్లాడొద్దు. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే నష్టాలు వస్తాయి.
సింహరాశి
ఈవారంలో సింహరాశి రాశి వారికి పెళ్లిళ్లు కుదురుతాయి. ప్రేమ వ్యవహారాల చక్కబడతాయి. బంధువులు దగ్గరవుతారు. పాత స్నేహితులు కలుస్తారు. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగం చేసే వారికి అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలర్ట్‌గా ఉండండి.
కన్యా రాశి
ఈ వారంలో కన్యా రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏవైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. రోజూ కొంత వ్యాయామం చేస్తే మంచిది. పూజల ద్వారా దైవ బలం పొందండి. ఉన్నత విద్యను అభ్యసించిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో జాబ్స్ వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి.
తులారాశి
ఈవారంలో తులారాశి వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి మరింత బెటర్ ప్యాకేజీతో కొత్త జాబ్స్ దొరుకుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు పండుతాయి. జీవిత భాగస్వామితో ప్రేమగా వ్యవహరించండి. గొడవలు వద్దు.
వృశ్చికరాశి
ఈ వారంలో వృశ్చిక రాశి వారు కొత్త ఆస్తులు కొంటారు. పలువురు తొలిసారి సొంతిల్లు కొంటారు. ఉద్యోగం చేసే వారికి పదోన్నతులు వస్తాయి. జాబ్ చేసే చోట పనిభారం ఉన్నా బాధపడొద్దు. ఫ్యూచర్‌లో మీకు గుర్తింపు లభిస్తుంది. కొత్త పరిచయాలతో కెరీర్ కొత్త మలుపులు తిరుగుతుంది.
ధనుస్సు రాశి
ఈవారంలో ధనుస్సు రాశి వారికి పెళ్లిళ్లు సెటిల్ అవుతాయి. వ్యాపారంలోకి కొత్త పెట్టుబడులు వస్తాయి. ఆర్థికంగా కలిసొస్తుంది. లాభాలు పండుతాయి. రాజకీయాల్లో ఉన్నవారికి మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. కీలక పదవులు దక్కుతాయి.
మకరరాశి
ఈవారంలో మకర రాశివారికి అప్పులు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంటికి బంధువులు వస్తారు. ఇంటి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు బీ అలర్ట్. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. వాహనం నెమ్మదిగా డ్రైవ్ చేయండి.
కుంభరాశి
ఈవారంలో కుంభరాశి వారికి అప్పులు రికవర్ అవుతాయి. బంగారు ఆభరణాలను కొంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. కుటుంబంలో గొడవలు జరగొచ్చు. సహనంతో వ్యవహరించండి. లేదంటే ఇబ్బందులు తప్పవు.
మీనరాశి
ఈవారంలో మీనరాశివారు కొత్త ఉద్యోగంలోకి మారుతారు. అదనపు ఆదాయాన్ని అందుకుంటారు. కొత్త వ్యాపారం మొదలుపెట్టేందుకు సరైన సమయం ఇది. వ్యాపారంలో అతిగా పెట్టుబడి పెట్టొద్దు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో బీ అలర్ట్. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.