Site icon HashtagU Telugu

Weekly Horoscope : వారఫలాలు.. మే 5 నుంచి మే 11 వరకు రాశిఫలాలను తెలుసుకోండి

Weekly Horoscope 2025 May 5 To 11 Astro Predictions Zodiac Signs Astrology

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మే 5 నుంచి మే 11 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో  తెలుసుకుందాం.

మేషరాశి

ఈవారంలో మేషరాశి(Weekly Horoscope) వారికి శాంత స్వభావం అవసరం.తొందరపాటు వద్దు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలు చేసే వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

వృషభ రాశి   

ఈవారంలో వృషభ రాశి వారు కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసొస్తాయి. వారం ప్రారంభంలో ఓ మంచి జరుగుతుంది.

Also Read :Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?

మిథున రాశి

ఈవారంలో  మిథున రాశి వారికి పాత అప్పులు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చే దిశగా అడుగులు పడతాయి. కోర్టు వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నాలు మొదలుపెడతారు.  కొత్త వస్తువులు కొంటారు.  దుబారా ఖర్చులు చేయొద్దు. మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. సూర్యబలం బాగున్నందున ప్రతి పనీ విజయవంతం కావొచ్చు. ఉద్యోగాలు చేస్తున్నవారు ఓర్పు, నేర్పుతో వ్యవహరించండి.

కర్కాటక రాశి 

ఈ వారంలో కర్కాటక రాశి వారు  అతిగా మాట్లాడొద్దు. ఆవేశం వద్దు. ఇతరుల గొడవల్లో తలదూర్చొద్దు. కొన్ని వ్యవహారాలను తాత్కాలికంగా వాయిదా వేయడం చాలా మంచిది. ఆస్తి విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్‌లో ఉన్న వారికి లాభాలు పండుతాయి.  భాగ్య శుక్రయోగం ధనలాభాన్ని సూచిస్తోంది.

సింహరాశి

ఈవారంలో సింహరాశి వారు మానసిక ఆందోళనకు గురవుతారు.  ఇతరులతో వాగ్వాదానికి దిగొద్దు. కొత్త పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే నిపుణులు, అనుభవం కలిగిన వారి సలహాలు తప్పక తీసుకోండి.  చెడును ఊహించుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో జీవితంలో ముందుకు సాగండి.

Also Read :Congress : హాట్ కేకుల్లా డీసీసీ అధ్యక్ష పోస్టులు.. కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి

కన్యారాశి

ఈ వారంలో కన్యారాశి వారు ఇతరులకు అప్పులు ఇవ్వకూడదు. పాత అప్పుల వసూలుకు ప్రయత్నాలు మొదలుపెట్టండి. ప్రాధాన్యతా క్రమంలో పనులు చేయండి. ఆవేశం, తొందరపాటు వద్దు.  కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ చేసే వారికి నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

తుల రాశి

ఈ వారంలో తుల రాశివారికి మంచి జాబ్ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. అది సరిగ్గా ఉంటే వెంటనే మారొచ్చు. అనవసర ఖర్చులు చేయొద్దు. ఇతరులను అపార్థం చేసుకోవద్దు. ఏవైనా సమస్యలు, అవరోధాలు ఎదురైతే అధైర్యపడొద్దు. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. గొడవలకు దూరంగా ఉండండి.

వృశ్చిక రాశి

ఈ వారంలో వృశ్చిక రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పండుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు భారీ లాభాలు రావొచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. మధ్యలో విరామం తీసుకుంటూ వెళ్లండి. ఇతరులు రెచ్చగొట్టినా సంయమనం కోల్పోవద్దు.

ధనుస్సు రాశి

ఈ వారంలో ధనుస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారంలో కొత్త సమస్యలు తలెత్తుతాయి.  సమయోచితంగా వ్యవహరించాలి. అప్పులు పెరిగే ముప్పు ఉంది. ఆకస్మిక ఖర్చులతో ఇబ్బందిపడతారు.  దుబారా ఖర్చులు వద్దు. కొత్త వ్యాపారం మొదలుపెట్టే ముందు బాగా ఆలోచించండి. తెలియని వ్యాపారాల్లోకి తలదూర్చొద్దు.  బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోండి.

మకరరాశి

ఈ వారంలో మకరరాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావొచ్చు లేదంటే శాలరీ పెరగొచ్చు. కొత్త వ్యాపారం మొదలుపెట్టేందుకు మంచి టైం. అనుకోకుండా ఆస్తిపాస్తులు చేతికి వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి మంచి టైం మొదలవుతుంది. కొందరు మీ ఓర్పును పరీక్షించే ప్రయత్నం చేస్తారు.

కుంభ రాశి

ఈ వారంలో కుంభరాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలను వేగంగా డ్రైవ్ చేయకూడదు. దూర ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పెట్టుబడులకు మంచి టైం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు.

మీనరాశి

ఈ వారంలో మీనరాశి వారు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు.  కుటుంబంలోని కొన్ని సమస్యలు ఏర్పడతాయి.  సహనంతో వ్యవహరించండి. ఇతరులను అర్థం చేసుకోండి. అనుకోకుండా కొన్ని ఖర్చులు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. పరిస్థితులకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో కష్టానికి తగిన ఫలితం అందుతుంది.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.