Site icon HashtagU Telugu

Weekly Horoscope : మార్చి 2 నుంచి 8 వరకు వారఫలాలు.. ఆ రాశుల వాళ్లకు రాజయోగం

Weekly Horoscope Astro Predictions Zodiac Signs 2025 March Astrology

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 మార్చి 2 నుంచి మార్చి 8  వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో  తెలుసుకుందాం.

Also Read :Youtube 20 Years: 20వ వసంతంలోకి ‘యూట్యూబ్‌’.. ఎలా ఏర్పాటైందో తెలుసా ?

మేషం 

ఈ వారంలో మేష రాశి(Weekly Horoscope) వారికి ప్రయాణాలు కలిసొస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. పదోన్నతులు వస్తాయి. వృత్తి, వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఇతరులకు ఆర్థికసాయం చేస్తారు. ప్రేమ వ్యవహారంలో పురోగతి ఉంటుంది.

వృషభం

ఈవారంలో వృషభ రాశివారికి వ్యాపారపరంగా సవాళ్లు ఉంటాయి. ప్రత్యర్థులు, పోటీదారులే పైచేయిని సాధిస్తారు. ఓపికతో ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ విషయాల్లో కోపం పనికి రాదు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొందరు బంధువులు, కుటుంబీకులపై మీకున్న అపార్థాలు తొలగుతాయి.

మిథునం

ఈ వారంలో మిథున రాశిలోని పలువురికి బంధువులతో గొడవలు జరుగుతాయి. అపార్థాలు పెరుగుతాయి. కొందరు మిత్రులతో గ్యాప్ పెరుగుతుంది. కోపం వదిలేయండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీకు ఆస్తిపాస్తులు వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. దుబారా వద్దు.

Also Read :Meenakshi Natarajan : మీనాక్షి మార్క్.. టీపీసీసీ కార్యవర్గం ఎంపికలో మారిన లెక్క

కర్కాటకం 

ఈవారంలో కర్కాటక రాశివారు కోపాన్ని దరి చేరనివ్వొద్దు. సహనంతో మెలగండి. ఇతరుల వ్యవహారాలలోకి తలదూర్చితే ఇబ్బందులు తప్పవు. కుటుంబ విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యయప్రయాసలను ఎదుర్కొంటారు. ఖర్చుల విషయంలో అప్రమత్తత తప్పనిసరి.  అదనపు ఆదాయం పొందుతారు.

సింహం

ఈవారంలో సింహ రాశి వారికి ఆర్థిక ప్రయోజనం దక్కుతుంది. రాదు అని వదిలేసిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆచితూచి నిర్ణయం తీసుకోండి. శాలరీతో పాటు సౌకర్యాలు కూడా చూసుకోండి.

కన్య

ఈవారంలో కన్య రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. అంకితభావానికి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.. జాగ్రత్త. దుబారాకు తావు ఇవ్వొద్దు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది.

తుల

ఈవారంలో తులరాశి వారి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మంచి జాబ్ దొరుకుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు సాగండి. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు వద్దు. రియల్ ఎస్టేట్, రాజకీయాల్లో ఉన్నవారికి టైం కలిసొస్తుంది.

వృశ్చికం 

ఈవారంలో వృశ్చిక రాశి వారి పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తల్లిదండ్రులకు మంచిపేరు తెస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఖర్చులు చేయండి. వృత్తి, వ్యాపారాలు కలిసొస్తాయి. కొన్ని వ్యక్తిగత సమస్యలు వస్తాయి. వాటికి మీరు ఊహించని పరిష్కారాలు లభిస్తాయి. డబ్బు విషయాల్లో ఎవరీ మాట ఇవ్వొద్దు.

ధనుస్సు

ఈవారంలో ధనుస్సు  రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థికంగా డెవలప్ అవుతారు. స్థిరాస్తి పెట్టుబడులు కలిసొస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో రాణిస్తారు.

మకరం

ఈవారంలో మకర రాశి వారి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారం, డబ్బు విషయంలో ఇతరుల సలహాలను గుడ్డిగా నమ్మకండి. పిల్లలు డెవలప్ అవుతారు. తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు వస్తాయి.

కుంభం 

ఈవారంలో కుంభ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. డబ్బుల వ్యయం విషయంలో ఆచితూచి వ్యవహరించండి.  వ్యాపారంలో ఏర్పడిన సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. నిరుద్యోగులకు మంచి టైం నడుస్తోంది.

మీనం 

ఈవారంలో మీన రాశి వారికి  రాజయోగం ఉంది. ఈ రాశివారు చెప్పే మాట చెల్లుతుంది. ఏది చేసినా సఫలం అవుతారు. అయితే అతివిశ్వాసం, అహంకారం వద్దు. వ్యాపారాల్లో లాభాలు పండుతాయి. కుటుంబ సభ్యులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రేమలు పెళ్లిగా మారుతాయి.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.