Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Sania Mirza: ‘‘మూడుసార్లు ప్రెగ్నెన్సీ’’ అంటూ సానియా కీలక వ్యాఖ్యలు
మేష రాశి
ఈవారంలో మేషరాశి వారి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకోని ఫలితాలు వస్తాయి. మంచికాలం నడుస్తోంది. ఆటంకాలు వస్తాయి. అయితే సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. ఈ వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది.
వృషభ రాశి
ఈవారంలో వృషభ రాశి వారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పొదుపుగా పదాలు వాడాలి. ఆచితూచి మాట్లాడటం బెటర్. ఆవేశం వద్దు. సహనం ముద్దు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి సహకారం దొరకదు. కుటుంబ సభ్యుల వివాదాలతో చికాకు కలుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. భూ, గృహ, వాహన యోగాలున్నాయి.
మిథున రాశి
ఈవారంలో మిథునరాశి వారి ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారం కలిసొస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నిపుణుల సలహాలు పొందాలి. మీరు కొత్త వాహనం కొనే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కలిసొస్తాయి. మానసికంగా బలంగా ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.
కర్కాటక రాశి
ఈవారంలో కర్కాటక రాశిలోని వ్యాపారులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో జాగ్రత్త. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. ఇతరులతో వాగ్వాదం ప్రయోజనకరం కాదు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. భాగ్య శుక్రయోగం అదృష్టాన్ని ఇస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి.
Also Read :Mann Ki Baat: తలచుకుంటే రక్తం మరుగుతోంది.. ఉగ్రదాడిపై మోడీ సీరియస్
సింహరాశి
ఈవారంలో సింహరాశి వారికి ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరుగుతాయి. మొహమాటానికి వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గ్రహదోషం అధికంగా ఉంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తిగత విషయాలను ఇతరులకు లీక్ చేసుకోవద్దు. వీలైనంత తక్కువ మాట్లాడండి. వృత్తి నిపుణులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి.
కన్యా రాశి
ఈవారంలో కన్యా రాశి వారు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం సరికాదు. ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు సరికాదు. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. తెెలివిగా వాటిని అధిగమించండి. అప్పులు అతిగా చేయొద్దు. ఓ ఆపద నుంచి గట్టెక్కుతారు.
తులారాశి
ఈవారంలో తులారాశి వారికి పాత అప్పులు వసూలవుతాయి. కొత్త స్థిరాస్తులు కొంటారు. అయితే తొందరపాటు వద్దు. వ్యాపార విషయాల్లో ఓపికగా నిర్ణయాలు తీసుకోండి.కొత్త ఉద్యోగ ఆఫర్ వస్తే.. బెటర్‌గా ఉంటే ఓకే చెప్పండి. దుబారా ఖర్చులు చేయకండి. మిత్రులను గుడ్డిగా నమ్మొద్దు.
వృశ్చిక రాశి
ఈ వారంలో వృశ్చికరాశి వారికి ధనయోగం ఉంది. గుడ్ న్యూస్ వింటారు. జీవిత భాగస్వామి సలహాలు కీలకంగా మారుతాయి. వ్యాపారం విషయంలో కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. పాత వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచేందుకు సరైన సమయం. కొత్త వ్యాపార భాగస్వాములు దొరుకుతారు. అప్పులు మంజూరవుతాయి.
ధనుస్సు రాశి
ఈవారంలో ధనుస్సు రాశి వారిని మోసం చేసేందుకు కొందరు యత్నిస్తారు. అందుకే ఇతరుల మాటలను వెంటనే నమ్మొద్దు. వ్యాపార నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాలు తీసుకునే క్రమంలో నిశిత పరిశీలన అత్యవసరం. లేదంటే తీవ్ర ప్రతికూల ఫలితాలు వస్తాయి. కొత్త ఇంటిని కొంటారు. పాత అప్పులు తీరుతాయి. కుటుంబ విషయంలో మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. దైవబలంతో దాన్ని అధిగమించాలి.
మకర రాశి
ఈవారంలో మకర రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఖర్చులు కూడా పెరగొచ్చు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఇంటికి బంధువుల తాకిడి పెరుగుతుంది. కొత్త వ్యాపారాలను షురూ చేయడానికి సరైన సమయం కాదు.
కుంభ రాశి
ఈవారంలో కుంభ రాశిలోని ఉద్యోగులకు తగిన గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ఉన్నవారు సైతం కొత్త అవకాశాలను అందుకుంటారు. స్థిరాస్తి, బంగారం వ్యాపారులకు, షేర్ల ట్రేడర్లకు కలిసొస్తుంది. చిన్ననాటి స్నేహితులు కలుస్తారు. దూర ప్రయాణాలు వద్దు. ఆన్‌లైన్ లావాదేవీల్లో ముప్పు పొంచి ఉంది.
మీన రాశి
ఈవారంలో మీన రాశిలోని(Weekly Horoscope) వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక వ్యూహంతో ప్రణాళిక సిద్ధం చేస్తే ఆ అడ్డంకులను అధిగమించొచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తారు. కొత్త ఉద్యోగం పొందిన వారికి పరీక్షా సమయం వస్తోంది. జాగ్రత్తగా ఈ వారాన్ని గట్టెక్కాలి. తోటి సిబ్బందితో గౌరవంగా, స్నేహంగా మెలగాలి. కెరీర్‌లో ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. స్కిల్స్ పెంచుకోండి.
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.