Site icon HashtagU Telugu

Weekly Horoscope : వారఫలాలు.. ఏప్రిల్ 13 నుంచి 19 వరకు రాశి ఫలాలను తెలుసుకోండి

Weekly Horoscope 2025 April Astro Predictions Zodiac Signs Pisces Sun Signs Astrology

Weekly Horoscope : రాశిఫలాలు అనేవి ప్రతిదినం మారుతుంటాయి. ఫలితంగా ఒక్కో రోజు ఒక్కో రాశి వారికి భిన్నమైన ఫలితాలు వస్తాయి. కొందరికి సానుకూల ఫలితాలు, మరికొందరికి ప్రతికూల ఫలితాలు దక్కుతాయి. రాశిఫలాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం వల్ల ఆయా రాశుల వారు ముందుజాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2025 ఏప్రిల్ 13 నుంచి 19 వరకు ఉన్న రాశిఫలాల వివరాలను ఈ కథనంలో  తెలుసుకుందాం.

Also Read :New Political Party: మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత సన్నిహితుడి స్కెచ్

మేషం

మేష రాశివారు(Weekly Horoscope) ఈ వారం అలర్ట్‌గా ఉండాలి. ఇతరుల గొడవల్లో తలదూర్చకూడదు. వాయిదాల చెల్లింపులో జాప్యం చేయొద్దు.ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొందరు ఫ్రెండ్స్ వల్ల ఇబ్బంది పడతారు. ఒక సంఘటన మీపై ప్రభావం చూపుతుంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సవ్యంగా సాగిపోతాయి.

వృషభం

వృషభ రాశివారి జీవితంలో ఈ వారం ప్రశాంతంగా గడుస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పు బకాయీలు చేతికి అందుతాయి. ఆదాయం పెరుగుతూపోతుంది. పెట్టుబడి నిర్ణయాల్లో తొందరపాటు వైఖరి తగదు. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది.

మిథునం

మిథున రాశి వారు ఈ వారంలో సహనంతో మెలగాలి. కోపం వద్దు. ఇతరులతో గొడవకు దిగొద్దు.  ఉద్యోగులకు శాలరీలు పెరుగుతాయి. వివిధ కంపెనీల నుంచి ఆహ్వానాలు వస్తాయి. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు విస్తరిస్తాయి. పిల్లలు విజయాలు తల్లిదండ్రులకు ఆనందాన్ని మిగులుస్తాయి.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈవారంలో ఉద్యోగ హోదా పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నగదు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే నష్టం జరగొచ్చు. దూరపు బంధుత్వాలు బలపడతాయి.

Also Read :New DGP : డీజీపీ రేసులో ఐదుగురు ఐపీఎస్‌లు.. ఛాన్స్ ఎవరికో ?

సింహం

సింహ రాశివారికి ఈ వారంలో ఆదాయం పెరుగుతుంది. బంధు మిత్రులకు సాయం చేస్తారు. కొన్ని లీగల్ సమస్యలు ఎదురవుతాయి. న్యాయ నిపుణులను సంప్రదించండి. భూముల కొనుగోలు, అమ్మకాల్లో జాగ్రత్త. అవసరానికి మించిన ఖర్చులు చేయకండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడిని పెంచుతారు.

కన్య

కన్య రాశి వారికి ఈ వారంలో ఒక ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది.  బాగా శ్రమిస్తారు. కానీ ఫలితం తక్కువ వస్తుంది. మొండిగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. నిపుణులతో సంప్రదించి వ్యాపార విషయాల్లో ముందడుగు వేయండి. ఖర్చులు తగ్గించుకోండి.

తుల

తుల రాశి వారికి ఈ వారంలో ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసొస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తొందరపాటుతో ఉద్యోగం మారొద్దు. స్నేహితులు, సహోద్యోగుల సలహా తీసుకోండి. మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. కుటుంబ కలహాలు సమసిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరుగుతుంది. అప్పులు వసూలు అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వాహనాన్ని అతివేగంతో డ్రైవ్ చేయొద్దు. కొత్త  వ్యాపారం ప్రారంభించడానికి అనుకూల సమయం. కొన్ని శుభవార్తలు వింటారు. అవగాహన లేని విషయాలపై మాట్లాడొద్దు. అనుమానాలు పెంచుకోవద్దు.

ధనుస్సు

ధనుస్సు రాశివారు ఈ వారంలో కొంత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారం, ఉద్యోగం రెండుచోట్లా శ్రమించక తప్పదు. అయినా మనోధైర్యం కోల్పోవద్దు. మీ వ్యతిరేకులే సన్నిహితులుగా మారుతారు. శుక్ర, శనివారాల్లో బీ అలర్ట్. మీ సీక్రెట్స్ ఇతరులకు చెప్పొద్దు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రలోభాలకు లొంగొద్దు. ఇతరుల ఒత్తిళ్లకు బెదరొద్దు. కొన్ని పోగొట్టుకున్న వస్తువులు, పత్రాలు దొరుకుతాయి. మీ ఆస్తుల విలువ పెరుగుతుంది.

మకరం

మకర రాశి వారు ఈ వారంలో బాగా కష్టపడతారు. ధైర్యం, ఓపిక కోల్పోవద్దు. మీకు విజయం దక్కి తీరుతుంది. పెద్ద ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాటిని వదలొద్దు. ఆస్తిపాస్తుల పత్రాలలో మార్పులు చేయించుకుంటారు. జాగ్రత్తగా మార్పులు చేయించండి. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారం లాభంలోకి వస్తుంది. సుదూర ప్రయాణాల్లో జాగ్రత్త.

కుంభం

కుంభ రాశి వారు ఈ వారంలో విలాసాలకు పోతారు. లగ్జరీ వస్తువులు కొంటారు. దుబారా వద్దు.  వేస్ట్ ఖర్చులు చేయొద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. కొత్త అప్పులు చేయొద్దు.  అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఆస్తి వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పాత అప్పులు వసూలవుతాయి.

మీనం

మీన రాశి వారు ఈవారంలో ఆకస్మికంగా  లాభాలను ఆర్జిస్తారు. వ్యాపార పెట్టుబడులు సిరులను పండిస్తాయి. కొత్త వ్యాపారాలను మొదలుపెట్టడానికి ఇది మంచి టైం. ఫోన్లలో లావాదేవీలు చెసేటప్పుడు జాగ్రత్త.  ఫోన్లలో వచ్చే మెసేజ్‌ల విషయంలో జాగ్రత్త. వెంటనే రియాక్ట్ కావొద్దు. జాగ్రత్తగా పరిశీలించండి.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.