Site icon HashtagU Telugu

Weekly Horoscope : ఆ రాశుల వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఈరోజు నుంచి డిసెంబరు 21 వరకు వీక్లీ రాశిఫలాలు

Weekly Horoscope 2025

Weekly Horoscope :  డిసెంబరు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాశిఫలాలను గ్రహాల కదలికలు, నక్షత్రాల గమనం ప్రభావితం చేస్తుంటాయి. వాటి ప్రకారం వీక్లీ రాశి ఫలాలపై(Weekly Horoscope) జ్యోతిష్యుల అంచనా ఇదీ..

మేషరాశి 

ఈ వారంలో  మేషరాశి వారికి అప్పులు తీరుతాయి. ఈవారంలో మూడు రోజుల తర్వాత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మీకు అదనపు ఆదాయం వస్తుంది. విద్యార్థులకు శుభవార్తలు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహరాశి 

ఈ వారంలో మీరు విలాసాలకు బాగా ఖర్చు చేస్తారు. భూమి, భవనం, వాహనం కొనాలనే కల నెరవేరుతుంది. మార్కెటింగ్ పనులు చేసేవాళ్లకు కలిసొచ్చే వారం ఇది.

Also Read :Winter Tips : చలికాలంలో ఏ వేడి పప్పులు తినాలి? నిపుణుల నుండి తెలుసుకోండి..!

తులారాశి 

ఈ వారంలో మీకు లక్కు కలిసొస్తుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. కొందరు విదేశాలకు వెళ్తారు. ప్రయాణంలో జాగ్రత్తలు అవసరం. ఈ వారం ద్వితీయార్థంలో ఆత్మీయులను కలుసుకుంటారు.

కుంభరాశి 

ఈవారంలో మీరు బాగా విలాసాలు చేస్తారు. పూర్వీకుల ఆస్తులు వస్తాయి. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది.  ఆదాయం పెరుగుతుంది. మీ ఉద్యోగం, వ్యాపారంలో పురోగమిస్తారు.

Also Read :Good News For Students: తెలంగాణ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు 2 సార్లు మ‌ట‌న్‌, 4 సార్లు చికెన్‌!

మీనరాశి

ఈ వారంలో  మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం, వ్యాపారం చేసేవారికి వారం మధ్యలో గుడ్ న్యూస్ వినిపిస్తుంది. పూర్వీకుల ఆస్తులు వచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుంది. దేశంలో టూర్‌లకు వెళ్తారు.

వృషభం

ఈవారంలో ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం మారడానికి ఇదే కరెక్ట్ టైం. దైవబలంతో అవరోధాలను అధిగమిస్తారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దు.

మిథునం

ఈవారంలో నిరుద్యోగులకు విదేశాల నుంచి జాబ్ ఆఫర్లు వస్తాయి. ఉద్యోగం మారడానికి ఇది మంచి టైం. పెళ్లికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు.

కర్కాటకం

ఈవారంలో మీ ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఇతరుల విషయాల్లో తలదూరిస్తే మీకే నష్టం. డబ్బు విషయంలో ఎవరికీ హామీలు ఇవ్వొద్దు.

కన్య

ఈవారంలో మీపై పని భారం, ఒత్తిడి తగ్గుతాయి. బంధు మిత్రుల నుంచి రావాల్సిన డబ్బులు తిరిగొస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీ ఆలో చనలు, నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి.మీ ప్రత్యర్థులను తేలిగ్గా తీసుకోవద్దు.

వృశ్చికం

ఈవారంలో మీకు ఆత్మవిశ్వాసం లోపించే అవకాశం ఉంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాట్లాడితే బెటర్. సమస్యలు వస్తే ఒత్తిడికి గురికావద్దు.

ధనుస్సు

ఈవారంలో మీకు పెట్టుబడులు కలిసొస్తాయి. మానసిక ఒత్తిడిని అధిగమిస్తారు. ఇతరుల విమర్శల్ని పట్టించుకోవద్దు. కొత్త వ్యాపార ప్రయత్నాలు చేయకండి.

మకరం

ఈవారంలో మీ ఆలోచనలను దారితప్పించే ప్రయత్నాలు జరుగుతాయి. అలాంటి వాళ్లకు చిక్కకండి. మీ టైంను వేస్ట్ చేసుకోవద్దు. మీ కొత్త ప్రయత్నాలు కలిసొస్తాయి.

మీనం

ఈవారం ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలం. ఈ వారంలో తీసుకునే నిర్ణయాలు.. వచ్చే ఏడాది ఫలితాలను నిర్దేశిస్తాయి. పరిస్థితులకు తగిన విధంగా మీ ఆలోచనలను మార్చుకోండి.

గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.