Broom: ఇల్లు శుభ్రం చేశాక చీపురు అలా పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

సాధారణంగా చాలామంది చీపురు విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చీపురు ల

  • Written By:
  • Publish Date - June 19, 2023 / 09:35 PM IST

సాధారణంగా చాలామంది చీపురు విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చీపురు లక్ష్మీదేవితో సమానం. అటువంటి చీపురు విషయంలో తెలిసి తెలియక కూడా కొన్ని రకాల తప్పులు చేయకూడదు. కాగా నిద్రలేచిన వెంటనే ప్రతి గృహిణి మొదట చేసేపని ఇంటిని శుభ్రం చేయడం. మహాలక్ష్మీ స్వరూపంగా భావించే చీపురుతో ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత ఆ చీపురుని ఓ మూలన పెడుతుంటారు. మూలన పెట్టినప్పుడు సాధారణంగా చీపురు పట్టుకునే భాగాన్ని నేలకు ఆనించి పెడుతూ ఉంటారు. కుచ్చుభాగం నేలకు తాకే విధంగా పెడితే పాడైపోతుందని ఇలా చేస్తుంటారు.

కానీ ఎప్పుడూ ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మనం ఎలా పట్టుకుంటామో అలాగే పెట్టాలి. పైగా చీపురుకట్టను నిలబెడితే దరిద్ర దేవతకు ఆహ్వానం పలుకుతున్నట్లే అని చెబుతారు. అవసరానికి మించి చీపురు కట్టలు కొని ఇంటిలో నిల్వ ఉంచకూడదు. ఈశాన్యం, ఆగ్నేయం వైపు కాకుండా నైరుతి, వాయువ్య మూల ఎవ్వరికీ కనిపించకుండా చీపురు పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చీపురు పట్టుకుని శివాయ నమః అంటూ శుభ్రం చేస్తే శనీశ్వరుడు ఆ ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోతాడని చెబుతారు. ఈశాన్యం నుంచి నైరుతి మూలకు శుభ్రం చేసి చెత్తను బయట డబ్బాలో వేసుకోవాలి. చీపురు, చాట ఒకే దగ్గర ఉంచడం అరిష్టం. ఇంటిలోపల, బయట ఒకే చీపురు వాడకూడదు.

పూజా గదిలో చీపురు కన్నా ఏదైనా శుభ్రమైన వస్త్రంతో తుడవటం మంచిది. సంధ్యా సమయానికి ముందుగానే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. బెడ్ రూమ్ లో మంచం కింద వస్తువులు సర్దేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ నిద్రపోయే మంచం కింద ఎలాంటి వస్తువులు, చెత్త, ముఖ్యంగా చీపురు ఉండకూడదట. మంచం కింద మాత్రమే కాదు బెడ్ రూమ్ లో చీపురు కనిపించకూడదని చెబుతారు. ఇకపోతే చీపురు ఎప్పుడు కొనాలి ఎప్పుడు పడేయాలి అన్న విషయాన్ని వస్తే..
మంగళవారం, శుక్రవారం, మహాలయ పక్షం అంటే భాద్రపదమాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు. గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణము తర్వాత రోజు చీపురు కొనకూడదు. పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు, హస్తా, శ్రవణం, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదు. ఇంటిలో పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడవేయాలి. ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికకాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి.