Varuthiini Ekadashi: ఏప్రిల్ 16న వరూథిని ఏకాదశి… ఈ 5 చర్యలతో శ్రీ హరి అనుగ్రహం

వరూథిని ఏకాదశి పండుగ ఏప్రిల్ 16న జరుగనుంది. ఆ రోజున వరుథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీవిష్ణువుతో పాటు లక్ష్మి మాత ఆశీస్సులు పొందొచ్చు.

Varuthiini Ekadashi : వరూథిని ఏకాదశి పండుగ ఏప్రిల్ 16న జరుగనుంది. ఆ రోజున వరుథిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీవిష్ణువుతో పాటు లక్ష్మి మాత ఆశీస్సులు పొందొచ్చు. ఈ పవిత్రమైన తిథి నాడు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడానికి ఉపవాసం, జపం, పూజలు చేసే సంప్రదాయం ఉంది. వరూథిని ఏకాదశి (Varuthiini Ekadashi) నాడు ఉపవాసం చేయడం వల్ల సాధకుని జీవితానికి సంబంధించిన కష్టాలన్నీ రెప్పపాటులో దూరమై సంతోషం, సౌభాగ్యం, ఆరోగ్యం లభిస్తాయి. వరూథిని ఏకాదశి వ్రతం రోజున ఆచరించాల్సిన పూజా విధానం, దానికి సంబంధించిన ముహూర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  1. హిందూ మతంలో విష్ణువును ప్రపంచ రక్షకుడిగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీ విష్ణువు యొక్క ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనది.
  2. వరూథిని ఏకాదశి రోజున శ్రీవిష్ణువు విగ్రహాన్ని పూజించి.. శంఖాన్ని ఊదితే శ్రీ హరి త్వరలో సంతుష్టుడై సాధకుడికి కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.
  3. ఈ వరూథిని ఏకాదశి రోజున విష్ణుమూర్తి పూజకు ఉపయోగించిన శంఖంతో గంగాజలాన్ని ఇంటింటా చల్లితే ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా పోయి పాజిటివ్ ఎనర్జీతో సంతోషం, శుభాలు కలుగుతాయి.
  4. వరూథిని ఏకాదశి రోజున శ్రీ విష్ణువును త్వరగా ప్రసన్నం చేసుకోవడానికి , కోరుకున్న వరం పొందడానికి తులసి ఆకును పూజలో సమర్పించే భోగంలో ఖచ్చితంగా సమర్పించాలి.
  5. శ్రీ విష్ణు ఆరాధనలో పసుపు రంగు వస్తువులను ఉపయోగిం చడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందని హిందూ విశ్వాసం. ఈ విధంగా వరుథిని ఏకాదశి వ్రతం రోజున శ్రీమహావిష్ణువును పసుపు వస్త్రాలు, పసుపు పుష్పాలు, పసుపు చందనం, పసుపు పండ్లు, పసుపు మిఠాయిలతో పూజించడమే కాకుండా పసుపు రంగు దుస్తులు ధరించాలి.
  6. వరూథిని ఏకాదశి రోజున శ్రీవిష్ణువు అనుగ్రహం పొందడానికి ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపాన్ని వెలిగించి పూజలు, హారతి చేయాలి. ఏకాదశి పూజలో ఈ పరిహారం చేస్తే, హరి అనుగ్రహం త్వరలో కురుస్తుందని నమ్ముతారు.

Also Read:  Thyroid Tips: సమ్మర్ డైట్‌లో 7 సూపర్‌ఫుడ్‌లు.. థైరాయిడ్ సమస్యలకు చెక్