Devotees : ఈ ఏడాది భక్తులు ఎక్కువగా దర్శించుకున్న క్షేత్రం వారణాసి

భారతదేశం (India) ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం.

భారతదేశం ఎన్నో ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయం. దేశంలో దర్శనీయ పుణ్యక్షేత్రాలలో ఎక్కువ మంది భక్తులు (Devotees) చెప్పే పేరు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి (కాశీ). ఈ సంవత్సరం (2022లో) ప్రజలకు అత్యంత ఇష్టమైన తీర్థ యాత్ర గమ్య స్థానంగా వారణాసి నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ 2022 రౌండప్ రిపోర్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది. తెలుగు వారి కలియుగ దైవం వెంకటేశ్వరుడి నిలయం తిరుమల తిరుపతి సైతం భక్తుల గమ్యస్థానంగా నిలిచింది.

రెండో స్థానంలో తిరుపతి:

దేశ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో భక్తులు (Devotees) వెళ్లేందుకు ఆసక్తి చూపించిన, దర్శించిన ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా వారణాసి నిలిచింది. ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టులో తిరుపతి రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఆ తరువాత ఒడిశాలోని పూరీ, పంజాబ్ లోని అమృత్‌సర్‌, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లను కూడా అత్యధిక ప్రజలు తమకు ఇష్టమైన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా టాప్ 5 స్థానాల్లో నిలిచాయని ఓయో నివేదికలో పేర్కొన్నారు.

పైన పేర్కొన్న నగరాలతో పాటు మహారాష్ట్రలోని షిర్డీ, ఉత్తరాఖండ్ లోని రిషికేశ్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, మహాబలేశ్వర్ (మహారాష్ట్ర)లతో పాటు  తమిళనాడులోని మధురై కూడా భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలలో నిలిచాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆయా ఆధ్యాత్మి పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

వారణాసి హిందువులు మరియు బౌద్ధులు ఇద్దరికీ ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. మొత్తం భారతదేశంలోని మతపరమైన పర్యాటక ప్రదేశాల కంటే దీని ప్రజాదరణ ఎక్కువగా ఉంది. ఒక ప్రదేశాన్ని మళ్లీ సందర్శించడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే తీర్థయాత్రల విషయానికి వస్తే ఇక్కడికి ఎన్నిసార్లయినా రావడానికి సిద్ధంగా ఉంటారు. పాదయాత్రకు వచ్చే జనంలో వృద్ధులే కాదు, యువత కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇప్పుడు గొప్ప సాంస్కృతిక ప్రదేశాలు, తెలియని ప్రదేశాలు (అవి గతంలో ఎన్నడూ లేనివి), రాజ భవనాలు మరియు మతపరమైన ప్రదేశాలను అన్వేషించడానికి ఉత్సాహంగా ఉన్నారు.

అగ్ర స్థానంలో నిలిచిన వారణాసి:

ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు ముందు, గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ ఫారమ్ OYO దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రయాణం, దర్శనీయ స్థలాల వివరాలు సేకరించింది. OYOలో రూమ్ బుకింగ్ డేటా ప్రకారం, ఆగస్టు నెలలో తీర్థయాత్రలు అధికంగా చేశారు. దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాలలో 2022 ఆగస్ట్ నుంచి అక్టోబర్ నెలల మధ్య OYO రూమ్ బుకింగ్ కు అధిక డిమాండ్ ఉంది. ఆధ్యాత్మిక ప్రాంతాలు, దర్శనీయ స్థలాల జాబితాలో వారణాసి దేశంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆగస్ట్ 13న ఇక్కడ అత్యధికంగా రద్దీ కనిపించినట్లు ఓయో రిపోర్ట్ చేసింది.

షిర్డీకి సైతం పోటెత్తిన భక్తులు (Devotees), పర్యాటకులు:

గదుల బుకింగ్స్‌లో యాత్రా స్థలాల్లో వారణాసి అగ్రస్థానంలో ఉంది. ఈ ఏడాది కూడా భక్తులు (Devotees), పర్యాటకులు అధిక సంఖ్యలో కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. గతంతో పోల్చితే శాతం పరంగా చూస్తే షిర్డీ (483 శాతం) తొలి స్థానంలో ఉండగా.. తిరుపతి (233 శాతం), పూరి (117 శాతం)తో వారణాసి తరువాత డిమాండ్ బుకింగ్స్ జరిగిన ప్రాంతాలు. అదే సమయంలో అమృత్‌సర్, హరిద్వార్‌లలో కూడా గదుల బుకింగ్‌లలో భారీ పెరుగుదల కనిపించింది. వీటితో పాటు, మథుర, మహాబలేశ్వర్,  మదురై లను అధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు సందర్శించారు. కరోనా వ్యాప్తి లాంటి భయాలు తొలగిపోవడం, కోవిడ్19 కేసులు తగ్గడంతో ఈ ఏడాది నవంబర్ వరకు భారీగా బుకింగ్స్ జరిగాయని ఓయో ఈ ఏడాది రిపోర్టులో స్పష్టం చేసింది.

Also Read:  Arasavalli : ఆంధ్రాలో గల ఏకైక ప్రాచీన సూర్య భగవానుడి ఆలయం