శ్రావణ మాసం (Sravanamasam) వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో..దేవాలయాల్లో దేవుడికి పూజలు చేస్తూ భక్తి పరవంశంలో మునిగిపోతారు. ఇక వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham) రోజున చెప్పాల్సిన పనిలేదు. మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. ఈ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ శుక్రవారం ఈరోజు. ఈ సందర్బంగా ఉదయం నుండే మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తున్నారు. అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక వరలక్ష్మి వర్థం సందర్బంగా పూలు , పండ్ల ధరలు (Flowers Prices Increased) కొండెక్కాయి.
We’re now on WhatsApp. Click to Join.
వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని, పూజా మందిరాన్ని వివిధ రకాల పూలు, మావిడాకులతో అందంగా అలంకరిస్తారు. ఇందుకోసం అవసరమైన పూజా సామాగ్రి, పూలు కొనుగోలు చేసేవారితో మార్కెట్లో కిక్కిరిసిపోయాయి. వివిధ రకాల పూలు పండ్లతోపాటు, కొబ్బరికాయలు, మావిడాకులు ఇతర పూజా సామాగ్రి కొనుగోలు కోసం వచ్చిన వారితో పలు హోల్ సేల్ పూల మార్కెట్లలో సందడి వాతావరణం నెలకొంది.
అదే విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు ముత్తైదువులకు వాయినాల్లో రకరకాల పండ్లు ఇస్తారు. ఫలితంగా, పూలు, పండ్ల మార్కెట్లు ముందురోజే కిటకిటలాడాయి. ఐతే పూలు, పండ్ల ధరలు చూసి కొనుగోలుదారుల వామ్మో అంటున్నారు. గత నెలలో మల్లెల ధర కేజీ రూ.550 ఉండగా, ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో కేజీ రూ.1,500 పలుకుతోంది. ఇక, తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, పసుపు చామంతి రూ. 150 నుంచి రూ.రూ.400, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, లిల్లీ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ.1,200 వరకు పెరిగాయి. బహిరంగా మార్కెట్‌లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. వీటి ధరలు చూసి కొంగలు దారులు వామ్మో అంటున్నారు.
Read Also : KTR : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్ పిలుపు ..