Site icon HashtagU Telugu

Valmiki Jayanti 2024 : మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Valmiki Jayanti 2024 Hindu Festival Ramayana

Valmiki Jayanti 2024 : ఇవాళ (అక్టోబరు 17) మహర్షి వాల్మీకి జయంతి. రామాయణాన్ని రచించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుంది. రామాయణాన్ని ఆదికావ్యం అంటారు. దాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకిని ఆదికవిగా పిలుస్తుంటారు. మన దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వాల్మీకి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు కాషాయవస్త్రాలు ధరించి శోభాయాత్రలు నిర్వహిస్తుంటారు. రామాలయాలు, ఆంజనేయుడి ఆలయాల్లో ఇవాళ వాల్మీకి(Valmiki Jayanti 2024) రామాయణాన్ని చదువుతారు. ఏపీ ప్రభుత్వం కూడా వాల్మీకి జయంతిని ఇటీవలే రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈరోజు అన్ని జిల్లాల్లో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.

Also Read :Anil Kumble Birthday : హ్యాపీ బర్త్‌డే అనిల్ కుంబ్లే.. స్పిన్ మాంత్రికుడి కెరీర్, సంపదపై విశేషాలివీ

Also Read :Cars Sales : రోజూ 12వేల కొత్త కార్లు రోడ్లపైకి.. ఏసీల వినియోగంలో టాప్ స్పీడ్