Site icon HashtagU Telugu

Tirupati : తిరుపతి లో జనవరి ఒకటిన వైకుంఠ ఏకాదశి ఉచిత దర్శనం కౌంటర్లు

TTD Tirumala Tirupati

Ttd Tirupati

జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార ఉచిత దర్శనంకు రోజుకు 50వేలు వంతున మొత్తం అయిదు లక్షల టోకెన్లు తిరుపతి (Tirupati) లో 9 కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. జనవరి 2023 ఒకటవ తేదీ (ఆదివారం) టోకెన్ల జారీ మొదలైతే అయిదు లక్షల టోకెన్లూ అయిపోయే వరకు అన్ని కేంద్రాల్లో 24 గంటలూ ఇస్తూనే ఉంటారు. తిరుమలలోని కేంద్రంలో మాత్రం తిరుమలలో నివాసం ఉన్న ఆదార్ కార్డు ఉన్న వారికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు కోసం తిరుమలకు వెళ్ళకండి. తిరుపతిలోని 9 కేంద్రాల్లో ఎవ్వరికైనా టోకెన్లు జారీ చేస్తారు.

తిరుపతి (Tirupati) లో టోకెన్స్ జారీ కేంద్రాలు:

  1. భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి వద్ద)
  2. రామచంద్ర పుష్కరిణి (అలిపిరి కి దగ్గరగానే ఉంటుంది)
  3. శ్రీనివాసం (ఆర్టీసీ బస్టాండ్ వద్ద)
  4. మున్సిపల్ ఆఫీసు (శ్రీనివాసంకు దగ్గరగా ఉంటుంది)
  5. గోవిందరాజు స్వామి సంత్రం (రైల్వే స్టేషన్ వెనుక)
  6. విష్ణు నివాసం (రైల్వే స్టేషన్ ముందు)
  7. MR పల్లి Z.P.హైస్కూల్
  8. రామానాయుడు స్కూల్
  9. జీవకోన Z.P.హైస్కూల్
  10. తిరుమల – కౌస్తభం (తిరుమల వాసులకు మాత్రమే)

మొదటి ఆరు కేంద్రాలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటాయి

శ్రీవారి సేవలో నారద పీఠం పంపే టీటీడీ గురించిన తాజా మెసేజ్ లు, నిత్య పంచాంగం కోసం 9392877277 వాట్సప్ నెంబర్ కు మెసేజ్ చేయండి.

Also Read:  Shunyamasam : శూన్య మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు?