Site icon HashtagU Telugu

TTD Temple : జమ్మూలో మొదటి TTD వేంకటేశ్వర స్వామి ఆలయం.. జూన్ లోనే ప్రారంభం..

TTD Temple opening in Jammu on June 8th

TTD Temple opening in Jammu on June 8th

TTD ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) ఆలయాలు(Temples) కడుతూ, అక్కడ కూడా తిరుమలలో జరిగే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూలో(Jammu) కూడా TTD వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. జూన్ లోనే ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాలు జరగనున్నట్టు TTD చైర్మన్ YV సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి నేడు జమ్మూలోని మజీన్ గ్రామంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంను సందర్శించారు. చివరి దశ పనులు పర్యవేక్షించారు.

అనంతరం YV సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రాలేని భక్తుల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తిరుమల లాగే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాలు నిర్మిస్తున్నాము. ఇక్కడ జమ్మూలో శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే జమ్మూ – కాట్రా మార్గంలో శ్రీవారి ఆలయంను నిర్మించాము. వైష్ణోదేవి యాత్రకు వెళ్లే భక్తులు స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. జమ్మూ ప్రభుత్వం 62 ఎకరాల స్థలం కేటాయించగా, రూ.30 కోట్ల వ్యయంతో శ్రీవారి ఆలయం, ఉప ఆలయాలు, పోటు, ఇతర సదుపాయాలు నిర్మిస్తున్నాము. జూన్ 3 నుంచి 8వ తేదీ వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. జూన్ 8న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు మహాసంప్రోక్షణ, 12 గంటలకు భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది అని తెలిపారు.

 

Also Read :  Shani Jayanti 2023 : శనిదేవుడిని బర్త్ డే రోజు.. ఇలా ఇంప్రెస్ చేయండి