Site icon HashtagU Telugu

Medaram : మేడారంలో అపచారం

Tribals Oppose Medaram Gadd

Tribals Oppose Medaram Gadd

తాడ్వాయి మండలం, ములుగు జిల్లాలో నిర్వహించనున్న మేడారం (Medaram) మహాజాతరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఆధునీకరణ కార్యక్రమాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణానికి కొత్త రూపు తీసుకురావాలన్న ప్రభుత్వ యోచనపై ఆదివాసీ (పూజారులు) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూజారుల ప్రకారం.. గద్దెల చుట్టూ రాతిపీఠాలు, శిలాస్తంభాలు, రాతితోరణాల రూపంలో మార్పులు తాము ఏ రూపంలోనూ సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఇదంతా తమ సంప్రదాయాలకే విరుద్ధమని పేర్కొన్నారు.

Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్‌ను తినడవం వల్లే క‌లిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు

ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి గతంలో చిన్నచిన్న మార్పులపైనా ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని గోపురాలతో అలంకరించాలన్న ప్రతిపాదన, లౌకిక రూపాలకు ప్రాధాన్యత ఇవ్వడం కచ్చితంగా తమ ఆదివాసీ ఆచారాలకూ విశ్వాసాలకూ వ్యతిరేకమని తెగల పెద్దలు స్పష్టంచేశారు. మంత్రులుగా వ్యవహరిస్తున్న సీతక్క, కొండా సురేఖల మధ్య నెలకొన్న విభేదాలు, జాతర ఏర్పాట్లపై ప్రభావం చూపుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీతక్క మౌనాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మేడారం జాతర పవిత్రతను భద్రపరిచేందుకు గతంలో విభిన్న ఘటనలపై ఆదివాసీలు చేసిన ఉద్యమాలు ఇప్పటికీ గుర్తించాల్సినవేనని సంఘాల ప్రతినిధులు అంటున్నారు. రాతివిగ్రహాలు, గోపురాలు, డీజే సౌండ్స్, ఎల్ఈడీ స్క్రీన్లు వంటి అంశాలపై ఇప్పటికీ అభ్యంతరాలు ఉన్నాయని, ఇవన్నీ గుంజేడు ముసలమ్మ జాతర తరహాలో మారుతున్నదిగా భావిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. ప్రకృతినే దైవంగా కొలుచే కోయ తెగ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించకపోతే, తీవ్ర ఉద్యమం తప్పదని వారు స్పష్టంచేశారు. “మా దేవతలకు రూపాలు లేవు. వాటికి విగ్రహాలూ, గోపురాలూ అవసరం లేదు” అంటూ తమ హక్కుల కోసం పోరాడతామన్నారు.