Site icon HashtagU Telugu

Evil Spirit : దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలంటే.. ఇంట్లో వీటిని అలంకరించుకోవాల్సిందే..

To Avoid Evil Spirits.. These Should Be Decorated At Home..

To Avoid Evil Spirits.. These Should Be Decorated At Home..

Avoid Evil Spirit at Home : వాస్తు శాస్త్రంలో ఆర్థిక సంస్థల నుంచి బయటపడడానికి, ఆనందం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం, దుష్టశక్తులు దరిచేరకుండా ఉండడం కోసం ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి. ముఖ్యంగా దుష్టశక్తులు (Evil Spirit) దరిచేరకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్న విషయంపై వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని రకాల విషయాలను సూచించారు. మరి దుష్ట శక్తులు మన దరిచేరకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అయితే దుష్టశక్తులు (Evil Spirit) దరి చేరకుండా ఉండాలంటే కొన్ని రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. చైనీస్ వాస్తులో సైతం విండ్ చైమ్ కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇవి ఇంటికి అందాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, నెగెటివిటిని దూరం చేస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

అంతేకాదు సంపద, ఆనందాన్ని కూడా తెస్తాయి. అయితే ఇవి ఇంట్లో అలంకరించే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. వాస్తు ప్రకారం విండ్ చైమ్స్ అమర్చిన ఇంట్లోకి సానుకూల శక్తి తనంతట తానే ఎవరో ఆహ్వానించినట్టుగానే వచ్చేస్తుంది. ఫలితంగా ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. వాస్తు చెప్పిన దాంటి బట్టి విండ్ చైమ్స్ అలంకరిస్తే ఇంట్లోకి అదృష్టం కూడా వస్తుంది. ఇంట్లోని వారికి అన్ని విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ ఎక్కడైనా విండ్ చైమ్స్ అలంకరించుకోవచ్చని అనుకుంటారు. అయితే తలుపు లేదా కిటికికి వాటిని అమర్చడం చాలా ఉత్తమం. వాస్తు ప్రకారం గాలి వల్ల అవి కదిలి వాటి నుంచి శ్రావ్యమైన ధ్వని ఉద్భవిస్తుంది. ఈ శబ్ధం ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తుంది.

అందువల్ల ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఎటువంటి చెడు ఇంట్లోకి చేరకుండా ఉంటుంది. చెక్క, లోహం, టెర్రాకోటా, పింగాణి ఇలా రకరకాల మెటిరియల్ తో తయారు చేసిన విండ్ చైమ్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదైనా ఇంట్లో లేదా ఆఫీసులో, వ్యాపార స్థలాల్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. అయితే వీటి నుంచి వచ్చే ధ్వని మితంగా ఉండాలి. ఎక్కువ ధ్వని చేసే విండ్ చైమ్స్ వల్ల మంచి జరగడానికి బదులు నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తాయి. కనుక ఈ జాగ్రత్త తప్పనిసరి. విండ్ చైమ్స్ ను ఆరుబయట కూడా వేలాడదీయవచ్చు. తోటలోనూ అమర్చుకోవచ్చు కానీ చెట్లకు వేలాడదీయవద్దు. ఇంట్లో శక్తి ప్రసారం పెద్దగా ఉండదని బావించే ప్రదేశాల్లో విండ్ చైమ్స్ అలంకరించి అక్కడ శక్తిని ప్రేరేపించవచ్చు. బెడ్ రూమ్ లోపల లేదా బెడ్ రూమ్ కిటికి దగ్గర కూడ చాలా మంచిది.

బెడ్ రూమ్ లో అలంకరించుకోవడానికి చెక్క లేదా వెదురుతో చేసిన విండ్ చైమ్స్ ఉత్తమమైనవి. బెడ్ రూమ్ లో బ్లూకలర్ లో ఉండే విండ్ చైమ్స్ అలంకరించుకుంటే నిద్ర లేమి వంటి సమస్యలకు పరిష్కారం దొరకుకుతుంది. వాస్తును అనుసరించి పశ్చిమాన మెటిరియల్ తో చేసిన విండ్ చైమ్ ను అమర్చుకుంటే ఇంట్లోని వ్యక్తులకు అదృష్టం కలిసొస్తుంది. పిల్లలు కూడా చదువులో రాణిస్తారు.

వాయవ్యంలో అమర్చిన లోహపు విండ్ చైమ్స్ ఇంట్లో సమృద్ధికి దోహదం చేస్తాయి. ప్రతికూల శక్తులు, దురదృష్టం పారద్రోలబడుతుంది. నైరుతిలో అమర్చిన విండ్ చైమ్స్ దాంపత్య జీవితాన్ని ఆనందమయం చేస్తాయి.ఉత్తరంలో అమర్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది. అల్యూమినియం, ఇత్తడి, రాగి వంటి మెటల్స్ తో తయారు చేసిన విండ్ చైమ్స్ పశ్చిమ దిక్కున , ఉత్తర లేదా వాయవ్యంలో అమర్చుకోవడం మంచిది. నైరుతి, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో మట్టి లేదా పింగాణితో చేసిన విండ్ చైమ్స్ అలంకరించుకోవడం మంచిది. దక్షిణ, తూర్పు, లేదా ఆగ్నేయంలో చెక్క తో విండ్ చైమ్స్ ఎంచుకోవడం మంచిది. వెదురు లేదా చెక్క ఉపయోగించి చేసిన విండ్ చైమ్స్ అలంకరించుకుంటే చాలా మంచిది.

Also Read:  Caffeine: కాఫీ ప్రియులరా జాగ్రత్త..! ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి ఎంతో హాని..!