Thursday Trick : ఈరోజు పసుపుతో ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి

పసుపు నివారణలు చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు. గురువారం (Thursday) రోజున మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.

Published By: HashtagU Telugu Desk
Turmeric Water Benefits

Turmeric Water Benefits

Thursday Trick to Attract Money : పసుపు ఆహారంలో మాత్రమే కాకుండా అందం నుంచి ఆరోగ్యం వరకు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. జీవితంలో సమస్యలను నివారించడానికి పసుపు పరిహారాలు కూడా ప్రయోజనకరంగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు మీ జీవితంలో ఆర్థిక సమస్యలు లేదా గ్రహ దోషాల వల్ల ఇబ్బంది పడుతుంటే కొన్ని పసుపు నివారణలు చాలా హెల్ప్ చేస్తాయని అంటున్నారు. గురువారం (Thursday) రోజున మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.

బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి గ్రహం అనేది పసుపుకు సంబంధించినది. పసుపు పరిహారాలను పాటిస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి ప్రసన్నం అవుతాడు. ఫలితంగా మీకు ఉన్న డబ్బు సంబంధిత సమస్యలన్నీ దూరం అవుతాయి. ఇక విష్ణువుకు పూజ చేస్తే లక్ష్మీ దేవి కటాక్షం కూడా లభిస్తుంది.

పసుపు (Turmeric) పరిహారాలు ఇవీ..

  1. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పసుపును గురువారం తప్పనిసరిగా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న గురు స్థానం బలపడి గురు దోషం తీరిపోతుంది. ఆరోగ్యం కూడా బాగుపడుతుంది.
  2. ఒక వ్యక్తి వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్నట్లయితే.. నల్ల పసుపు, కుంకుమపువ్వు కలిపి మీ డబ్బుల పెట్టెలో స్వస్తిక్ గుర్తు గీయండి.
  3. మీరు కెరీర్‌లో అపజయాలు, అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లయితే, గురువారం (Thursday) నాడు నీటిలో కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై విజయం చేరువవుతుంది.
  4. మీరు ఆర్థిక సంక్షోభంలో ఉంటే గురువారం నాడు ఎర్రటి గుడ్డలో ఐదు పసుపు ముద్దలను కట్టి మీ డబ్బుల పెట్టెలో ఉంచండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి మీ ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
  5. గురువారం (Thursday) నాడు శ్రీమహా విష్ణువుతో పాటు వినాయకుడిని పూజించండి. ఈసందర్భంగా మీరు స్వయంగా వినాయకుడికి పసుపు తిలకం వేయండి. ఆ తర్వాత వినాయకుడి నుదుటి నుంచి తిలకం తీసి మీ నుదుటిపై రాయండి. ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తుంది.
  6. ఇంటి బయటి గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుందని నమ్ముతారు. గురువారం పసుపు రేఖను గీస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తుంచుకోండి.
  7. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న వ్యక్తి గురువారం నాడు విష్ణువు, గురువు బృహస్పతిని పూజించాలి. పూజానంతరం, మణికట్టు మెడపై పసుపుతో చిన్న గీత రాయండి. ఇలా చేయడం వల్ల గురు గ్రహం బలపడుతుంది.

Also Read:  Business Ideas: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. అయితే ఎప్పటికీ కొనసాగే బిజినెస్ ఇదే.. నెలకు లక్షల రూపాయలు ఎక్కడికి పోవు..!

  Last Updated: 04 May 2023, 03:16 PM IST