Shani Dev: శని దేవుని కృప మీపై ఉందని చెప్పే సంకేతాలు ఇవే..?

Shani Dev: సాధారణంగా ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటే అప్పుడు మనకు శని చుట్టుకుంది అని అంటూ ఉంటారు. అయితే కష్టాలు ఉన్నప్పుడు శని దేవుడు అగ్రహించాడు

  • Written By:
  • Publish Date - October 19, 2022 / 06:30 AM IST

Shani Dev: సాధారణంగా ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటే అప్పుడు మనకు శని చుట్టుకుంది అని అంటూ ఉంటారు. అయితే కష్టాలు ఉన్నప్పుడు శని దేవుడు అగ్రహించాడు అని ఎలా అయితే అనుకుంటాము అదేవిధంగా శని దేవుని కృప మీపై ఉన్నప్పుడు కూడా కొన్ని రకాల పనులు జరుగుతాయట. మరి శని దేవుని కృప మీపై ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేవిధంగా శని దేవుని కృప మనపై ఉంటే ఎటువంటి సంకేతాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వేళ శనిదేవుడు ప్రసన్నుడైతే, ఆ వ్యక్తికి సర్వతోముఖ ప్రయోజనాలు లభిస్తాయి. శనిదేవుని కృప ఉన్న వ్యక్తి జీవితంలో చాలా మార్పులు వస్తాయి.

మరి ముఖ్యంగా శని దేవుని అనుగ్రహంతో జీవితంలో సకల సౌకర్యాలు, ఐస్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. శని దేవుడి కృప మనపై ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం నిలకడగా ఉండడం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం లాంటివి శని దేవుడి ఆశీర్వాదానికి సంకేతాలుగా చెప్పవచ్చు. అయితే ఆరోగ్యం బాగా ఉన్నప్పుడు రోగులకు సహాయం చేయడం శనివారం రోజు శని దేవునికి గుడికి వెళ్ళి పూజించడం లాంటివి చేయాలి. అలాగే కీర్తి ప్రతిష్టలు వేగంగా పెరుగుతుంటే దానిని మీ పట్ల శనీశ్వరుడి కృప గా భావించండి.

శనీశ్వరుడు ప్రసన్నుడైతే వ్యక్తి కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, శని దేవుడికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెబుతూ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించాలి. అదేవిధంగా శనివారం రోజు బూట్లు, చెప్పులు లాంటివి దొంగిలించబడినట్లయితే అది చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. శని దేవుడు మీ పట్ల సంతోషంగా ఉన్నారని అర్థం. అటువంటి సమయంలో శని దేవుని గుడికి వెళ్లడం శనిని భక్తిశ్రద్ధలతో పూజించడం లాంటివి చేయాలి.