Sukanya Story: ముసలి మునితో కన్నెపిల్ల సుకన్య వివాహం

పురాణాల్లో భృగు మహర్షి వృత్తాంతం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఆయన కుమారుడు చ్యవనుడు. ముసలి వయసులో చ్యవనుడు కన్నెపిల్ల సుకన్యను పెళ్లి చేసుకుంటాడు. మొదటి చూపులోనే తన అందానికి పరవశితుడవుతాడు. తన అందాన్ని కామించి, ప్రేమించి ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. 

Sukanya Story: పురాణాల్లో భృగు మహర్షి వృత్తాంతం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఆయన కుమారుడు చ్యవనుడు. ముసలి వయసులో చ్యవనుడు కన్నెపిల్ల సుకన్యను పెళ్లి చేసుకుంటాడు. మొదటి చూపులోనే తన అందానికి పరవశితుడవుతాడు. తన అందాన్ని కామించి, ప్రేమించి ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.

సూర్యవంశంలో ఇక్ష్వాకుడనే రాజు ఉండేవాడు. మహారాజుకు కుమారుడుతో పాటు కుమార్తె ఉంది. కుమార్తె పేరు సుకన్య. సుకన్య యవ్వనస్థురాలు. శృంగార దేవతలా కనిపించే కన్నెపిల్ల. తన అందానికి ఎవ్వరైనా మంత్రముగ్దులు కావాల్సిందే. ఒకరోజు ఇక్ష్వాకుడు వనవిహారానికి రాజధానికి దగ్గరలో ఉన్న మానస సరోవరం అనే సరస్సుకు కుటుంబసమేతంగా వస్తాడు. ఆ సరొవరం దగ్గరలొ ఉన్న అడవిలొ భృగు మహర్షి కుమారుడు చ్యవన మహర్షి తపస్సు చేసుకొంటూ ఉన్నాడు. తపస్సులోనే వందల ఏళ్ళు గడిచిపోయాయి. మహర్షి చుట్టూ చీమల పుట్టపెరిగింది. ఒళ్ళంతా లతలు అలుముకున్నాయి .అయినా తన తపస్సుని ఏనాడూ వీడాలనుకోలేదు.

అలా మహర్షి తపస్సులో ఉండగా ఇక్ష్వాకుడి కుమార్తె సుకన్య చ్యవనుడు తపస్సు చేసుకొంటున్న పుట్ట వద్దకు వస్తుంది. ఆ పుట్ట సుకన్యను ఎంతగానో ఆకర్షిస్తుంది. యవ్వనంలో సౌందర్యంలో మెరుపు తీగలాగ మెరిసిపోతున్న సుకన్యను చ్యవనుడు చూసి ప్రసన్నుడై ఆమెను పుట్టలోంచే పిలిచాడు. కాని అతని కంఠం నుంచి మాట బయటకు రాలేదు. పుట్టలో మెరుస్తున్న అతని కళ్ళను చూసి కుతూహలంతో ఆమె తన దగ్గర ఉన్న పుల్లను తీసుకొని అతని కళ్లను పొడిచింది. వెంటనే అతను కోపంతో లేచి ఇక్ష్వాకుడి సైన్యానికి మలమూత్ర బంధనం కలిగించాడు.

We’re now on WhatsAppClick to Join

సైన్యం అంతా కష్టంతో విలవిల్లాడారు. అప్పుడు ఇక్ష్వాకుడు తన పరివారాన్ని పిలిచి చ్యవనునికి ఎవరు హాని కలిగించారు అని వారిని నిలదీశాడు. వారి వద్ద సమాధానం లేదు. మలమూత్ర అవరోధం వలన బాధపడ్తున్న సైన్యాన్ని చూసి చింతిస్తున్న తండ్రిని చూచి సుకన్య తండ్రి దగ్గరకు వెళ్లి ఇలా అన్నది. వనంలో విహరిస్తున్న నేను మెరుస్తున్న కండ్లను చూసి మిణుగురు పురుగులుగా భావించి దగ్గరకు వెళ్ళి ముల్లుతో పొడిచానని భయం భయం చెప్పింది. .అప్పుడు ఇక్ష్వాకుడు వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి చ్యవనుని వేడుకున్నాడు. తన సైన్యం ప్రాణ రక్షణ కోసం ప్రార్థించాడు. నా కుమార్తె అజ్ఞానంతో ఈ అపరాధం చేసింది. ఆమెను క్షమించండని బ్రతిమాలాడు. దానికి చ్యవనుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు. నా కన్నుల్ని పొడిచి నన్ను అంధుని చేసింది. రూప, ఔదార్యం కలిగి ఉన్న ఆమెను నాకిచ్చి వివాహం చేస్తే మిమ్మల్ని క్షమిస్తాను అన్నాడు. మహర్షి కోరికను ఇష్టంగా తీసుకున్న సుకన్య తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. సుకన్యను భార్యగా స్వీకరించి ఇక్ష్వాకుడు సైన్యాన్ని పాపం నుంచి విముక్తి కలిగిస్తాడు. సుకన్య భర్తను తన తపస్సుతో నియమ నిష్టలతో సేవ చేసి అతన్ని మెప్పించింది.

Also Read: Rs 4650 Crore Seized : సరికొత్త రికార్డ్.. రూ.4,650 కోట్లు సీజ్ చేసిన ఈసీ