Lunar Eclipse : ఇవాళ చంద్రగ్రహణం.. వచ్చే నెలలో సూర్యగ్రహణం.. పండితులు ఏమంటున్నారు ?

సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు  చంద్రగ్రహణం(Lunar Eclipse) సంభవిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Second Lunar Eclipse India Celestial Event

Lunar Eclipse : ఈ సంవత్సరానికి సంబంధించిన రెండో చంద్రగ్రహణం ఇవాళే ఏర్పడింది. అయితే ఇది మన దేశంలో కనిపించదు. దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్  ప్రాంతాల్లోని దేశాల్లో కనిపిస్తుంది. హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో కూడా దీన్ని చూడొచ్చు.  చంద్రగ్రహణం వల్ల గురువారం సాయంత్రం వరకు మూడు రోజుల పాటు చంద్రుడు పూర్తి కాంతిలో కనిపిస్తాడు. సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు  చంద్రగ్రహణం(Lunar Eclipse) సంభవిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద నక్షత్రంలో ఏర్పడుతుంది.

Also Read :Blindsight Device : అంధులకు చూపును ప్రసాదించే పరికరం.. ప్రయోగానికి న్యూరాలింక్‌ రెడీ

ఇక ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు కూడా ఏర్పడుతాయి. ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్‌లో ఏర్పడగా, రెండో సూర్యగ్రహణం అక్టోబరులో ఏర్పడబోతోంది. సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9 :13 గంటలకు ప్రారంభమవుతుంది. అది 6 గంటల 4 నిమిషాల పాటు ఉంటుంది. ఇది భారతదేశంలో కనిపించదు.  దీనివల్ల దాని సూతక సమయం ఎఫెక్టు మనదేశంపై ఉండబోదు. ఈసారి సూర్యగ్రహణం వల్ల మిథునం, కర్కాటకం, వృశ్చిక రాశుల వారికి మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. 

Also Read :Kiwi Health Benefits : మీకు కివీ పండు తొక్క తీసి తినే అలవాటు ఉంటే ఈరోజే వదిలేయండి..!

  • ఈసారి వచ్చే నెలలో ఏర్పడబోయే సూర్యగ్రహణం వల్ల  మిథున రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తలపెట్టిన పనుల్లో సక్సెస్ అవుతారు. ఈ రాశి వారికి సూర్యుడితో కేతువు ఉండటం వల్ల అంతా మేలు జరుగుతుంది. కెరీర్ సానుకూల దిశలో ముందుకు సాగుతుంది.
  • వచ్చే నెలలో ఏర్పడే సూర్యగ్రహణం వల్ల కర్కాటక రాశి వారికి వస్తు సౌఖ్యాలు లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. జీవితం పురోగతి దిశగా ముందుకు సాగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.
  • వచ్చే నెలలో సూర్య గ్రహణం వల్ల వృశ్చిక రాశివారి వైవాహిక జీవితం ఆనందమయంగా మారుతుంది. ఆదాయం పెరుగుతుంది.
  Last Updated: 18 Sep 2024, 01:23 PM IST