Site icon HashtagU Telugu

Hariyali Teej 2025 : శ్రావణమాసంలో హరియాలి తీజ్ ప్రాముఖ్యత?..ఈరోజు మహిళలు ఏం చేస్తారు?

The importance of Hariyali Teej in the month of Shravan?..What do women do today?

The importance of Hariyali Teej in the month of Shravan?..What do women do today?

Hariyali Teej 2025 : ప్రకృతి పచ్చదనంతో నిండిపోయే శ్రావణమాసం ఆరంభమైన మూడవ రోజున జరుపుకునే పవిత్ర పండుగ హరియాలి తీజ్. ఈ పండుగ హిందూ సాంప్రదాయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ముఖ్యంగా వివాహిత స్త్రీల కోసం ఈ పండుగ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. భర్త దీర్ఘాయుష్షు, ఆరోగ్యాన్ని కోరుతూ, దేవి పార్వతిని ప్రార్థిస్తూ, స్త్రీలు ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఈ పండుగలో ప్రత్యేకంగా ఆకుపచ్చ రంగుకు ప్రాముఖ్యత ఉంది. పచ్చ రంగు ప్రకృతిని, సస్యశ్యామలత్వాన్ని, శాంతిని ప్రతిబింబిస్తుంది. ఇదే కారణంగా హరియాలి తీజ్ నాడు మహిళలు ఆకుపచ్చ రంగు చీరలు, ఆభరణాలు ధరించడం ఆనవాయితీగా మారింది. ముఖ్యంగా ఆకుపచ్చ గాజులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు.

Read Also: Car Driving : నిద్ర మత్తులో కారు ను ఏకంగా గోడపైకే ఎక్కించిన డ్రైవర్

శాస్త్రోక్తంగా కూడా పచ్చ రంగు శివుని ప్రియమైన రంగుగా పేర్కొనబడింది. అలాగే, దేవి పార్వతికి కూడా ఈ రంగు ఎంతో ఇష్టమైనది. అందుకే హరియాలి తీజ్ సందర్భంగా స్త్రీలు పచ్చ గాజులను ధరించి, అమ్మవారికి అర్చనలు చేస్తారు. పచ్చ గాజులు సౌభాగ్యం, ఐశ్వర్యానికి సంకేతంగా నిలుస్తాయి. వివాహిత స్త్రీలు హరియాలి తీజ్ నాడు గాజులను నిర్ణీత సంఖ్యలో ధరించాలి. ముఖ్యంగా 5, 7, 11 లేదా 21 గాజులు ప్రతి చేతికి వేసుకోవడం శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం. ఈ సంఖ్యలు పౌరాణికంగా పవిత్రంగా భావించబడతాయి. అలాగే, ఈ సంఖ్యలతో సంబంధం ఉన్న గణిత శాస్త్రం ప్రకారం కూడా ఇవి శుభసూచకాలు.

గాజులు వేసుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా అవసరం. పాత గాజులను రెండూ చేతులనుండి ఒకేసారి తీసేయడం నిషిద్ధం. ముందు కుడి చేతి గాజులను తీసి కొత్తవి వేసుకున్న తర్వాతే ఎడమ చేతికి మార్చాలి. ఇది సాంప్రదాయ రీతి ప్రకారం శుభంగా పరిగణించబడుతుంది. కొత్త గాజులు ధరించే ముందు అవి పవిత్రతను పొందాలని భావించటం సంప్రదాయం. అందుకే వాటిని పార్వతీ దేవి పాదాల వద్ద సమర్పించి, తర్వత ధరించాలి. అది సాధ్యం కాకపోతే అమ్మవారిని మనసులో ధ్యానించి, గాజులను చేతులకు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గాజులు ఆధ్యాత్మికంగా పవిత్రతను పొందతాయి.

హరియాలి తీజ్ సందర్భంగా వివాహిత మహిళలు వ్రతాలు పాటిస్తూ ఉపవాసం ఉంటారు. పార్వతీదేవి శివుని వరంగా పొందిన రోజుగా భావించే ఈ తీజ్ రోజున, స్త్రీలు పార్వతీదేవిని స్మరించి గానాలు పాడటం, స్వింగ్స్ (ఊయలలు) వేయడం వంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. గ్రీష్మ కాలం ముగిసిన అనంతరం వర్షాకాలం ప్రవేశించడంతో ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ పచ్చదనం, ఉత్సాహాన్ని ఆకుపచ్చ రంగు ద్వారా ఆవిష్కరించడం ఈ పండుగ ప్రత్యేకత. ఈ ఏడాది 2025లో శ్రావణమాసం జూలై 25న ప్రారంభమైంది. హరియాలి తీజ్ జూలై 27న, ఆదివారం వచ్చింది. ఈ సందర్భంగా సుమంగళి స్త్రీలకు ఆకుపచ్చ గాజులు బహుమానంగా ఇవ్వడం, ఆప్యాయతను, శుభకాంక్షలను వ్యక్తపరిచే మాధ్యమంగా మారింది.

సంప్రదాయాలు కేవలం ఆచారాలే కాదు, అవి జీవితాన్ని విశ్వాసంతో నడిపించే మార్గదర్శకాలు. ఈ హరియాలి తీజ్ సందర్భంగా పచ్చ గాజులు ధరించి, స్త్రీలు తమ సౌభాగ్యాన్ని నిలుపుకుంటారని, కుటుంబానికి శాంతి, ఆరోగ్యం లభిస్తుందని నమ్మకం. కావున ఈ పండుగను శ్రద్ధగా జరుపుకొని, సంప్రదాయ విలువలను భావప్రధంగా పాటిద్దాం.

Read Also: Monsoon Trips : వర్షపు చినుకుల్లో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలా?.. అయితే మహారాష్ట్రలో ఈ 8 స్పాట్‌లను మిస్ అవ్వకండి!