Ravanas Clan : దీపావళి పండుగను అందరూ ఆనందోత్సాహాలతో సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మన దేశంలోని కొన్ని అరుదైన తెగల వారు నేటికీ ఈ పండుగను జరుపుకోకుండా ఉండిపోతున్నారు. వారివారి ప్రాచీన విశ్వాసాల ఆధారంగా దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి అరుదైన తెగలు, వర్గాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి
గడ్చిరోలిలో..
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో ఉండేే గోండులు(Ravanas Clan) చాలా స్పెషల్. ఎందుకంటే.. వారు తమను రావణుడి వంశీకులుగా భావిస్తుంటారు. రావణుడే గోండు జాతి రాజు అని నమ్ముతారు. ఆయనపై ఇతర వర్గాల వారు దాడి చేసి చంపారని గడ్చిరోలి గోండులు చెబుతుంటారు. రావణుడి కథలో సీతను అపహరించడం అనే ఘట్టమే లేదని వారు వాదిస్తుంటారు. సంస్కృతంలోని వాల్మీకీ రామాయణంలో రావణుడిని చెడ్డవాడిగా చెప్పలేదని గడ్చిరోలి గోండులు చెబుతున్నారు. అందుకే రావణుడు, రావణ కుమారుడు మేఘనాథుడి విగ్రహాలకు వీరు పూజలు చేస్తుంటారు. రావణుడి మరణంతో ముడిపడిన దీపావళి పండుగను ఈ గోండులు సంతాప సూచకంగా జరుపుతారు. బాణసంచా కాల్చరు.
Also Read :Nepal Vs India : ఇండియా భూభాగంతో నేపాల్ మ్యాప్.. ఆ నోట్ల ప్రింటింగ్ కాంట్రాక్టు చైనాకు
తిరుచ్చిలో..
- తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో ఉన్న కొన్ని గ్రామాలు వెరీ స్పెషల్. సామ్పత్తి, తొప్పు పత్తి గ్రామాల ప్రజలు దీపావళిని జరుపుకోరు. బాణసంచా కాలిస్తే మర్రిచెట్టుపై ఉండే గబ్బిలాలు డిస్టర్బ్ అవుతాయని వారు వాదిస్తుంటారు. ఈ ఊళ్ల ప్రజలు తమ దేవుడు మునియప్ప సామి నివసించే ఇల్లుగా మర్రిచెట్టును భావిస్తారు. అందుకే ఆ చెట్టుపై ఉండే గబ్బిలాలు డిస్టర్బ్ కాకూడదనే ఉద్దేశంతో బాణసంచా కాల్చరు. దీపావళి రోజు స్వీట్లు పంచి సరిపెడతారు.
- తమిళనాడులోని వెట్టంగుడి పక్షుల సంరక్షణ కేంద్రం సమీపంలోని ఊళ్ల ప్రజలు కూడా దీపావళి చేసుకోరు. పక్షుల సంరక్షణ కేంద్రంలోని పక్షులకు హాని జరగకూడదని వారు బాణసంచాకు దూరంగా ఉంటారు. పక్షుల సంరక్షణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.