Site icon HashtagU Telugu

Ganesh Chaturthi : ‘పుష్పరాజ్ – శ్రీవల్లి’ గా గణనాథుడు…ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

Pushpa 2 Theme Ganesh Idol

Pushpa 2 Theme Ganesh Idol

Ganesh Chaturthi 2024 – The Devotees Fire on Ganesh Idol Makers : వినాయక చవితి (Ganesh Chaturthi) వస్తుందంటే చాలు గల్లీ గల్లీ మారుమోగిపోవాల్సిందే. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. ఒకప్పుడు వినాయక చవితి అంటే పల్లెల్లో పెద్దగా పట్టించుకునేవారు కాదు..కానీ పదేళ్లు గా పల్లెల్లో , గల్లీ గల్లీలో వినాయకుడ్ని నిలబెడుతూ నవరాత్రుల ఉత్సవాలు జరుపుతూ వస్తున్నారు.

అల్లు అర్జున్ – రష్మిక లా మాదిరి వినాయకుడి విగ్రహాలు

ఇక గణనాథుల విగ్రహాలు (Different Types Of Ganesh Idols) కూడా మారుతూ వస్తున్నాయి. విభిన్న రూపంలో దర్శనం ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఏది నడుస్తుందో ఆ మాదిరిగా విగ్రహాలను తయారుచేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా పలు రూపాలలో విగ్రహాలను రూపొందించారు. వాటిలో ‘పుష్పరాజ్ – శ్రీవల్లి ‘ గెటప్ లో ఉన్న విగ్రహం (Pushpa-2 Theme Ganesh Idol) ఫై భక్తులు ఆగ్రహం (The Devotees Fire on Ganesh Idol Makers) వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ – రష్మిక (Allu Arjun – Rashmika) కలయికలో సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 (Pushpa 2) ఫై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆ సినిమా నుంచి అల్లు అర్జున్, రష్మిక మందన కలిసి నటించిన ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’ సాంగ్ విడుదలై వరల్డ్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ మీద రీల్స్ , మీమ్స్ కూడా బాగానే నడిచాయి. అదంతా ఫ్యాన్స్ సినిమాపైన చూపించే అభిమానం. అయితే ఆ అభిమానం వినోదం వరకే ఉండాలి..కానీ హద్దులు దాటి భక్తి మీదకు వచ్చింది. సేమ్ పుష్ప 2 సినిమాలోని పుష్ప-శ్రీవల్లి పాత్రలతో.. ఆ పాటలో కనిపించిన సేమ్ ఔట్ ఫిట్ తో గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. డీపీ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అర్జున్ ఫై అభిమానం ఉంటె మరీ ఇంతలా దిగజారిపోతే ఎలా..?

మరీ ఇంతలా దిగజారిపోతే ఎలా? అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ వినాయకుడ్ని ఇలా పుష్ప 2లో పాత్రలతో తయారు చేయిస్తారా? అసలు మీకు బుద్ధి ఉందా.. అయినా పుష్ప వినాయకుడు, బాహుబలి వినాయకుడు, స్పైడర్ మ్యాన్ వినాయకుడు ఇలా పిచ్చిపిచ్చి ఆకృతుల్లో తయారు చేసి హిందుత్వాన్ని మంటగలుపుతారా? అసలు ఈ వినాయకుడ్ని ఎక్కడ పెట్టారో చెప్పండి..ఇలాంటి పనులు చేసి హిందూ మతాన్ని కించపరుచుకుంటున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Backward Walking : ముందుకు కాకుండా వెనుకకు నడవడం ప్రాక్టీస్ చేయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి.!