Surya Tilak : అయోధ్య ఆలయంలో అద్భుతం.. బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం..

శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది

Published By: HashtagU Telugu Desk
Suryatilk

Suryatilk

అయోధ్య (Ayodhya ) రామాలయంలో అద్భుతం జరిగింది. బాల రాముడి (BalaRamudu ) నుదుటిపై సూర్యతిలకం (Surya Tilak) దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసిన భక్తులు..భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈరోజు శ్రీరామ నవమి సందర్బంగా అన్ని ఆలయాలు రామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ఉదయం నుండే భక్తులు కళ్యాణం చూసేందుకు పోటీ పడుతూ వచ్చారు. ఇక అయోధ్య లో శ్రీరామ నవమి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉదయం నుండే పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు , భక్తులు ఆలయంకు చేరుకున్నారు. ఇక శ్రీరామ నవమి పర్వదినాన అయోధ్య రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. గర్భగుడిలోని బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు తిలకంగా (Surya Tilak) ప్రసరించాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన టెక్నాలజీ సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదిటిపై కన్పించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. సరిగ్గా మధ్యాహ్నం 12: 16 గంటల సమయంలో 58 మిల్లీమీటర్ల పరిమాణంతో సూర్య కిరణాలు బాలక్‌ రాముడి నుదుటిని తాకాయి. కొన్ని నిమిషాల పాటు ఈ తిలకం కనువిందు చేసింది. ఆ సమయంలో ఆలయ అధికారులు బాల రాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు.

Read Also : AP : అంబటి రాంబాబు ‘పేపర్ టీ కప్పు’లను కూడా వదలడం లేదు..

  Last Updated: 17 Apr 2024, 01:39 PM IST